ఉద్యోగుల కోసం ప్రభుత్వం నిలబడుతుంది ఉద్యోగులు ప్రజల కోసం నిలబడాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఎంప్లాయిస్ హెల్త్ స్కీం, కోటి రూపాయల ప్రమాద బీమా, సహజ మరణానికి 10 లక్షల బీమా, విద్యా విధాన పరిషత్తు ఉద్యోగులను 010 పద్దు కింద తీసుకురావడంలో దిశ నిర్దేశం చేసిన సందర్భంగా శుక్రవారం సాయంత్రం ప్రజా భవన్ లో ఉద్యోగ సంఘ నాయకులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ను సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ ఉద్యోగులు మొత్తాన్ని బాగా చూసుకోవాలి అనేది ప్రభుత్వం లక్ష్యం అన్నారు. ప్రజా ప్రభుత్వం పాలనలో చేపట్టే ప్రతి అంశం చివరి వ్యక్తి వరకు చేరే కార్యక్రమాన్ని ఉద్యోగులతో చేయించాలనేది మా ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ఉద్యోగ వ్యవస్థ బలంగా ఉండాలి వారి కుటుంబాలు భరోసాతో ఉండాలని కోటి రూపాయల ప్రమాద బీమా, హెల్త్ స్కీం తీసుకొచ్చామని తెలిపారు.
ఆర్దిక ఇబ్బందులను అధిగమిస్తూ ప్రజలకు వ్యవస్థలు, సంస్థలు ఉపయోగపడాలనేది మా కోరిక అన్నారు. రాష్ట్రంలో 1.15 కోట్ల కుటుంబాలు ఉండగా 1.02 కుటుంబాలకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నాము, అదేవిధంగా రాజు ఆరోగ్యశ్రీ అమలు చేస్తున్నాము అన్నారు. ప్రతి పథకం ప్రజల దగ్గరికి తీసుకు వెళ్ళేందుకు 99 రోజుల కార్యక్రమాన్ని తీసుకువచ్చామని వివరించారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను సీరియస్ గా తీసుకొని యధాతధంగా కింది వరకు అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఉద్యోగ సంఘ నాయకులు మారం జగదీశ్వర్, ఏలూరి శ్రీనివాసరావు, దామోదర్ రెడ్డి, సదానంద్ గౌడ్, మధుసూదన్ రెడ్డి, బి. శ్యామ్, దాస్య నాయక్, వెంకట్ రెడ్డి, ఉమా దేవి, డాక్టర్ రామారావు, షౌకత్ హుస్సేన్, వెంకట్,
సత్యనారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.