తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హోళీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతి పండుగగా హోళీని ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ప్రేమ, ఆప్యాయత సంతోషాల హరివిల్లుగా, శాంతి సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలిచే పండుగ హోలీ అని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. సహజ సిద్ధమైన రంగులు, సాంప్రదాయ పద్ధతులతో పండుగను జరుపుకోవాలన్నారు. కులమతాలకు అతీతంగా ప్రజల సమైక్యతను చాటే పండుగ హోళీని వేడుకగా జరుపుకోవాలని అన్నారు.