- మహిళల హాకీ కి మహత్తర ఏర్పాట్లు
- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారు జితేందర్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ ఎండి డాక్టర్ సోనీ బాలాదేవి
మహిళల హాకీ కి మహా అద్భుతమైన ఏర్పాట్లు చేశాం. ప్రభుత్వం ఇస్తున్న సహకారంతో
జాతీయ ఫెడరేషన్లే కాక అంతర్జాతీయ క్రీడా ఫెడరేషన్ల టోర్నమెంట్లు. మన జాతీయ క్రీడ అయిన హాకీ కి పునర్వైభవం తెచ్చేందుకు, హాకీ లో మహిళల భాగస్వామ్యం పెంచడానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు వరల్డ్ మహిళల హాకీ క్వాలిఫైంగ్ మ్యాచ్ లను గచ్చిబౌలిలో నిర్వహిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారులు ఏపీ జితేందర్ రెడ్డి అన్నారు అంతర్జాతీయ మహిళల హాకీ క్వాలిఫైయింగ్ టోర్నమెంట్ సందర్భంగా ఈ రోజు గచ్చిబౌలి స్టేడియంలో ఈ పోటీలో పాల్గొంటున్న ఎనిమిది జట్ల కెప్టెన్లతో కలిసి ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మన జాతీయ క్రీడ హాకీ కి పునర్ వైభవం తీసుకురావడానికి క్రీడల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విధంగా స్ఫూర్తి కలిగించడానికి అంతర్జాతీయ మహిళా హాకీ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు. స్పోర్ట్స్ అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సోని బాలాదేవి మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వ క్రీడా శాఖ సహకారంతో గచ్చిబౌలి హాకీ స్టేడియంలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఈ టోర్నమెంట్ కు కావలసిన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా ఎటువంటి లోటుపాట్లు లేకుండా చేయగలిగామని అన్నారు. తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ దాదాపు రెండు నెలల నుంచి చేసిన కృషి ఫలితంగా గచ్చిబౌలిలో ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ను నిర్వహించ బోతున్నామని తెలిపారు. ఈ ప్రెస్ మీట్ లో మాట్లాడిన 8 జట్ల కెప్టెన్లు తెలంగాణ క్రీడా శాఖ చేసిన ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వ ఆతిధ్యం ఆదరణ పట్ల ధన్యవాదాలు తెలియజేశారు.
అద్భుతమైన హాకీ కి గచ్చిబౌలి ఆస్ట్రో టర్ఫ్ వేదిక కాబోతుందని అన్నారు.
