తెలంగాణ PCBలో “వీరింతే.. వీరు మారరంతే”..!

  • తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (TGPCB) ప్రభుత్వ పరిధిలోకి రాదా…?
  • ప్రభుత్వ రంగ స్వయం ప్రతిపత్తి సంస్థ అయిన తెలంగాణ PCB కొంత మంది అవినీతి అధికారుల జేబు సంస్థనా…?
  • PCBలోకి ఉద్యోగులుగా వెళ్ళి అక్రమ సంపాదనతో అడ్డగోలు చేష్టలు చేస్తున్నది ఎవరు..?
  • PCB అధికారులు ప్రభుత్వ వ్యవస్థలో భాగంగా ప్రజల కోసం పనిచేయాలనే విషయం మర్చిపోతే ఎలా..?
  • ఆ కొంతమంది PCB అధికారులకు కాలుష్య బాధితుల గోడు పట్టదా..?
  • పరిశ్రమలకు, కార్పొరేట్ హాస్పిటల్స్ కు కొమ్ము కాస్తే ఏం చేసిన చెల్లుతుందా…?

✳️ తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (TGPCB) ప్రభుత్వ పరిధిలోకి రాదా…?
✳️ ప్రభుత్వ రంగ స్వయం ప్రతిపత్తి సంస్థ అయిన తెలంగాణ PCB కొంత మంది అవినీతి అధికారుల జేబు సంస్థనా…?
✳️ PCBలోకి ఉద్యోగులుగా వెళ్ళి అక్రమ సంపాదనతో అడ్డగోలు చేష్టలు చేస్తున్నది ఎవరు..?
✳️ PCB అధికారులు ప్రభుత్వ వ్యవస్థలో భాగంగా ప్రజల కోసం పనిచేయాలనే విషయం మర్చిపోతే ఎలా..?
✳️ ఆ కొంతమంది PCB అధికారులకు కాలుష్య బాధితుల గోడు పట్టదా..?
✳️ పరిశ్రమలకు, కార్పొరేట్ హాస్పిటల్స్ కు కొమ్ము కాస్తే ఏం చేసిన చెల్లుతుందా…?
✳️ అవినీతిలో శృతిమించిపోయిన కొంత మంది PCB అధికారులు చేస్తున్న తప్పులను ఎవరు ఎత్తి చూపొద్దా..? అలా ఎత్తి చూపిన వారిపై తప్పుడు ప్రచారం చేస్తూ వీల్లేదో బుద్దిమంతులలాగా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు ఎందుకు.?.
✳️ కొంతమంది PCB అధికారులు ఉద్యోగంలోకి వచ్చినప్పుడు వారి ఆస్తుల విలువ ఎంత..? ప్రస్తుతం వారి ఆస్తుల విలువ ఎంత..? అంతలా అక్రమాస్తులు పెరగడం, బినామీల పేర్ల మీద పెట్టడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి..?
✳️ PCBలో శృతిమించిన కొంతమంది అవినీతి అధికారులపై వార్తలు రాస్తే జీర్ణించుకోలేకపోతున్నారా…? నిజంగా వారు అంత నీతిమంతులే అయితే వారు సంపాదించిన అక్రమాస్తులపై మరియు వారిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణకు సిద్దమా..? వారు చేస్తున్న తప్పులు వారికి కనిపించవా..? వారు ఏమైనా చట్టానికి చుట్టాలా..?

✳️ ఇలాంటి విచ్చలవిడి అవినీతికి అలవాటుపడిన అధికారులపై విజిలెన్స్ & ఎన్ ఫోర్స్ మెంట్ మరియు ACB అధికారులు దాడులు చేయరు అనే ధైర్యమా…? లేక అవినీతి సొమ్ముతో ఎవరినైనా మేనేజ్ చేయగలం అనే ధీమానా..?
✳️ పరిశ్రమల వారు చేస్తున్న తప్పులే వీరి యొక్క అక్రమ ఆదాయ మార్గం…? పరిశ్రమల యాజమాన్యాలు వారి అవసరం కోసం ఎవరికీ చెప్పరు..? బయటపెట్టరు అనే ధైర్యమా..?
✳️ ఇలా అయితే PCBలోని అవినీతి అనకొండల భరతం పట్టేది ఎవరు..? కాలుష్య బాధితులకు న్యాయం జరిగేది ఎప్పుడు..? వీరు ఏమైనా IAS, IFS అధికారుల కంటే ఎక్కువనా..?
✳️ PCBలోని కొంతమంది అధికారులు.. తాము ప్రభుత్వ పరిధిలోని అధికారులం అనే సంగతి ఎందుకు మర్చిపోతున్నారు..? వారి బాధ్యతను వారికి గుర్తు చేయాల్సింది ఎవరు..? ఈ ఆవినీతి అధికారులకు వారి బాధ్యత గుర్తు చేయడానికి ఉన్నతాధికారులు, పర్యావరణ వేత్తలు, మేధావులు, పాత్రికేయులు, కాలుష్య బాధితులు మరియు ప్రజలు సరిపోరా..? పై నుండి ఇంకా ఎవరైనా దిగిరావాలా..?
✳️ ప్రభుత్వంలో భాగమైన PCB అధికారులు ప్రజల కోసం పనిచేయడానికి ఉన్నామనే సంగతి మర్చిపోయి.. నిబంధనలకు విరుద్దంగా కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలను కట్టడి చేసి ప్రజల ఆరోగ్యం కాపాడాలనే సోయి ఎందుకు లేకుండా పోతుంది..? ప్రతి పనికి లంచం తీసుకోవాలి అనే వీరి బుద్ది మారదా..?
✳️ PCBలో శృతిమించిన కొంతమంది అవినీతి అధికారులు ఏ స్థాయి విచారణకు అయిన సిద్దంగా ఉన్నారా…?

✳️ అదే నిజం ఐతే కాలుష్య బాధితులు తమకు 10% న్యాయం కూడా జరగడం లేదని ఎందుకు వాపోతున్నారు..? గత మూడు సంవత్సరాల కాలంలో కాలుష్యంపై ఫిర్యాదులు చేసిన ఫిర్యాదుదారులందరితో బహిరంగ చర్చకు సిద్దమా..? అక్కడిక్కడే నిజా నిజాలు తేల్చేద్దమా..?
✳️ కాలుష్య బాధితులు పరిశ్రమలపై చేస్తున్న ఫిర్యాదులపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు..? వాటిని అడ్డుపెట్టుకుని లంచం తీసుకుంటున్నమాట నిజం కాదా..?

✳️ PCBలో తప్పులే జరగపోతే కాలుష్య బాధితులు, పర్యావరణ వేత్తలు RTI ద్వారా సమాచారం అడిగితే ఇవ్వకుండా ఎందుకు దాస్తున్నారు..? నెలల కొద్ది కాలయాపన ఎందుకు చేస్తున్నారు..? అడిగిన సమాచారం ఇవ్వకుండా ఎందుకు PCB కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారు..? దీని వెనుక ఉన్న మర్మం ఎవరికి తెలియదన్నట్టు “పిల్లి పాలు తాగుతూ నన్ను ఎవరు చూస్తలేరు అన్నట్టు” ఎందుకు డ్రామాలు ఆడుతున్నారు..? ఎంతకాలం ఆడగలుగుతారు..?
✳️ కొంతమంది శృతిమించిన అవినీతి PCB అధికారులు చేస్తున్న తప్పులను ఎవరూ చెప్పొద్దా..? అలా చెప్పిన వారిపైనే నిందలు వేస్తారా..?

✳️ వీరి చర్యల వల్ల ప్రజల్లో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తదని వీరికి తెల్వదా..? కొంతమంది PCB అధికారుల వైఖరితో ప్రజల్లో.. కాలుష్య బాధితుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తది అనే సోయి ఎందుకు లేకుండా పోతుంది..? కొంతమంది PCB అధికారుల వైఖరి వల్ల రాష్ట్రం కాలుష్యమయం అవుతున్నది అన్న సంగతి వీరికి తెల్వదా..?
✳️ ఎన్ని పరిశ్రమలు PCB రూల్స్ ప్రకారం నడుస్తున్నాయి..? నిజాయితీ అధికారులతో కమిటీ వేసి రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమలలో ఇన్స్ పెక్షన్ చేపిస్తే తట్టుకునే ధైర్యం కొంత మంది పిసిబి అవినీతి అధికారులకు ఉందా..?
✳️ ఎన్నో ఆస్పత్రులు CFO, CFE లు లేకుండా సంవత్సరాలకు సంవత్సరాలు నడుస్తున్న ఎందుకు ఈ అధికారులకు కనపడటం లేదు..? వాటిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు..? వాటిపై సమగ్ర విచారణకు సిద్దమా..?
✳️ ఎన్ని ఆస్పత్రులు STPలను PCB రూల్స్ ప్రకారం నడుపుతున్నాయి..? దీని వెనుక ఎటువంటి అవినీతి జరగడం లేదా..?

✳️ ఉన్న విషయం చెప్తే కొంతమంది శృతిమించిన అవినీతి అధికారులకు ఉలుకెందుకు..? ఈ శృతిమించిన కొంతమంది అవినీతి అధికారులు తమ తప్పులను కప్పిపుచ్చుకోడానికి PCBలోని నిజాయితీ అధికారులను, కాలుష్య బాధితులను, పర్యావరణ వేత్తలను మేధావులను కూడా తప్పుడు ప్రచారాలతో బదనాం చేస్తున్న ఆ కొంతమంది PCB అధికారులు ఎవరు..?

✳️ అసలు వీళ్ళకి మేం ప్రభుత్వ అధికారులం.. ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా మా పనితనం ఉండాలి అనే సోయి ఎందుకు లేకుండా పోతుంది..? ఆ కొంతమంది PCB అధికారుల తీరుపై మండిపడుతున్న కాలుష్య బాధితులు, మేధావులు, పర్యావరణ వేత్తల ప్రశ్నలకు సమాధానం ఎవరు చెప్తారు..?
✳️ PCBలో కొంత మంది అవినీతి అధికారుల తీరు ఎలా ఉంది అంటే అవినీతి చేయడం రాజ్యాంగపరంగా మాకు వచ్చిన హక్కు అన్నట్టు ప్రవర్తిస్తున్నారు అని పలువురు పర్యావరణ వేత్తలు చెబుతున్నారు.

✳️ కొంత మంది PCB అధికారుల ప్రవర్తన మేం ఎంత పెద్ద ఎత్తున లంచాలు తీసుకున్న.. కాలుష్య పరిశ్రమలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోయిన.. తెలంగాణలో పర్యావరణం నాశనం చేసిన.. కాలుష్య బాధితులు, ఫిర్యాదుదారులు, పర్యావరణ వేత్తలు, మేధావులు ఎవరు మమ్మల్ని ప్రశ్నించకూడదు అంటూ.. ఒకవేళ ప్రశ్నిస్తే PCB అవినీతి అధికారులు అంతా కలిసి ప్రశ్నించిన వారిపై నిందలు వేస్తూ.. PCBలో విచ్చలవిడి అవినీతికి పాల్పడుతున్న ఈ కొంత మంది PCB అధికారులు కాలుష్య బాధితులను, పర్యావరణ వేత్తలను, మేధావులను సైతం చిన్నచూపు చూస్తూ.. అవమానకరంగా వారి నోటికొచ్చినట్లు మాట్లాడుతూ పైశాచికానందం పొందుతున్నారని పలువురు PCB అధికారులే చెప్పటం గమనార్హం.

✳️ అసలు PCBలో ఉద్యోగం రాకముందు వారి జీవితాలు ఎలా ఉండేవి అనేది మర్చిపోయి.. తాము PCBలోకి ఎలా వచ్చాము అనేది కూడా మర్చిపోయి.. గతంతో సంబంధం లేకుండా విచ్చలవిడిగా అవినీతి డబ్బు సంపాదించి.. ఆ డబ్బుతో మేము ఎవరిని అయిన మేనేజ్ చేస్తాం.. ఆఖరికి మా మీద విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ కు ఫిర్యాదు చేసిన.. ACB అధికారులకు ఫిర్యాదులు చేసిన మమ్మల్ని ఫిర్యాదుదారులు ఏం చేయలేరు.. మా దగ్గర ఉన్న అవినీతి సొమ్ముతో అందరినీ మేనేజ్ చేస్తాం అంటూ తోటి PCB అధికారుల దగ్గరే చెప్పుకుంటున్నారు అంటే వీరి బరితెగింపు ఎలా ఉందో అర్దం చేసుకోవచ్చు. కనీసం మేం ప్రభుత్వ ఉద్యోగులం ప్రజలకు జవాబుదారులం అనే సంగతినే పూర్తిగా మర్చిపోయారు కొంతమంది అవినీతి PCB అధికారులు.

✳️ PCBలోకి ACB ఎందుకు రావడం లేదని.. ఈ కొంత మంది అవినీతి పిసిబి అధికారుల పని ఎందుకు పట్టడం లేదని.. ఈ విచ్చలవిడి అవినీతి అధికారుల పని పడితేనే మిగతా వారికి బాధ్యత గుర్తుకువస్తుంది. తెలంగాణలో పర్యావరణం బాగుపడుతుందని పలువురు కాలుష్య బాధితులు, పర్యావరణ వేత్తలు, మేధావులు సైతం పలు వేదికలపై తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. విచ్చలవిడి అవినీతి చేస్తున్న కొంత మంది PCB అవినీతి అధికారులను కట్టడి చేయపోతే తెలంగాణలో కాలుష్య బాధితులు పెరగడంతో పాటు ఎంతోమంది తమ ప్రాణాలను కోల్పోవల్సి వస్తుంది అని వాపోతున్నారు. ఈ కొంత మంది ఆవినీతి PCB అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటేనే కాలుష్య పరిశ్రమలు సైతం దారికి వస్తాయి అని లేదంటే తెలంగాణలో భవిష్యత్ తరాలు ఎంతో నష్టపోతాయి అని పలువురు మేధావులు, పర్యావరణ వేత్తలు చెబుతున్నారు.

✳️ ఇక PCB ఉద్యోగుల సంఘం ఉంది. అది పేరుకే ఉద్యోగుల సంఘం ఉద్యోగుల సంక్షేమం కోసం గానీ.. ప్రభుత్వం నుంచి రావాల్సిన బెనిఫిట్స్ కోసం గానీ.. వారికి రావాల్సిన ప్రమోషన్స్ కోసం గానీ.. PCBకి అవసరమైన కొత్త ZO, RO కార్యాలయాల ఏర్పాటు కోసం గానీ, కొత్తగా రావాల్సిన పోస్టుల కోసం గానీ పని చేయాల్సిన PCB సంఘం అసలు విషయాలు పట్టించుకోకుండా కొంతమంది అవినీతి అధికారులను కాపాడుకోవడం కోసం మాత్రం పనిచేస్తది. ఆ కొంత మంది అవినీతి అధికారులు ఎంత పెద్ద తప్పు చేసిన ఈ సంఘ నాయకుల కండ్లకు కనీసం కనపడదు.. ఆ అవినీతి అధికారులను కాపాడుకోవడం కోసం ఎవరినైనా కలుస్తారు.. వారికి ఎటువంటి శిక్ష పడకుండా కాపాడుకుంటారు.. అంతేగానీ అసలు అలాంటి తప్పులు ఎందుకు చేశావ్.. PCBకి చెడ్డపేరు ఎందుకు తెస్తున్నావ్ అని మాత్రం అడగడానికి కూడా వారికి నోరు రాదు.. పైగా తప్పుచేసిన అధికారిపై ఫిర్యాదు చేసిన వారిపైనే రకరకాల నిందలు వేస్తూ.. తప్పుచేసిన అధికారులను కనీసం మందలించకుండా మీరు ఏ తప్పైన చేయండి మన దగ్గర ఉన్న అవినీతి సొమ్ముతో బయటపడొచ్చు అనే ధైర్యం మాత్రం ఇస్తారు. PCBలో విచ్చలవిడిగా అవినీతి చేయడం తప్ప PCB చట్టలపై కనీస అవగాహన కూడా లేని పనిరాని కొంత మంది అవినీతి అధికారులను బాగానే వెనుకేసుకొస్తున్నారు. అసలు ఈ విషయం PCB ఛైర్మన్, మెంబర్ సెక్రెటరీల దృష్టిలో ఉందా..? లేదా..? లేదంటే వారిని పూర్తిగా పక్కదారి పట్టిస్తున్నారా..?

✳️ అసలు PCBని ఏర్పాటు చేసిన ప్రధాన ఉద్దేశం మరియు ఉద్యోగుల ప్రధాన కర్తవ్యమే పర్యావరణాన్ని పరిరక్షించడం, కాలుష్యాన్ని నియంత్రించడం కోసం.. కానీ వీరిలో కొంత మంది ఉద్యోగులు PCB యొక్క మౌలిక స్వరూపాన్ని, ప్రధాన ఉద్దేశాన్ని సమూలంగా సర్వనాశనం చేయడం జరిగిందని పర్యావరణ వేత్తలు, మేధావులు, ప్రజలు వాపోతున్నారు. PCBలో ఉద్యోగం అంటేనే పర్యావరణ పరిరక్షణను, కాలుష్య నియంత్రణను గాలికి వదిలేసి లంచాలకు అలవాటు పడి అవినీతి సొమ్మును విచ్చలవిడిగా దండుకోవచ్చనే ఆలోచనతో ఉన్న కొంత మంది అవినీతి అధికారులు లంచం తీసుకోవడం అనేది మా జన్మ హక్కు అనే ఆలోచనా దృక్పథాన్ని నరనరాన జీర్ణింపచేసుకుని భారత మాజీ చీఫ్ ఎలక్షన్ కమీషనర్ (Chief Election Commissioner) JM Lyngdoh చెప్పినట్లు అవినీతి అనేది క్యాన్సర్ జాడ్యంలాగా పట్టిపీడిస్తుందని పలువురు వాపోతున్నారు.

✳️ ఓ PCB అధికారి ప్రైవేట్ ఆస్పత్రులకు ఫేక్ సర్టిఫికెట్స్ ఇచ్చి లక్షల రూపాయల లంచం దోచుకున్న విషయంపై పోలీస్ స్టేషన్ లో FIR నమోదు అయిన కూడా తప్పుచేసిన అధికారిపై ఎటువంటి చర్యలు ఉండవు..? అసాంఘిక కార్యాలపాలకు పాల్పడుతున్నాడు అని ఓ అధికారిపై విజిలెన్స్ & ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులకు ఫిర్యాదు వెళ్తే PCBలోని ఉన్నతాధికారులు ఆ మహిళా అధికారిని బెదిరించి బలవంతంగా తప్పుచేసిన అధికారికి అనుకూలంగా లెటర్ ఇప్పించడం నిజం కాదా..? ఈ మధ్యకాలంలో ఓ PCB అధికారిపై విజిలెన్స్ & ఎన్ ఫోర్స్ మెంట్ విచారణ జరిగింది నిజం కాదా..? ఆ అవినీతి అధికారిపై కనీసం శాఖాపరమైన చర్యలు కూడా ఎందుకు తీసుకోలేదు..? అతడు ఏమైనా సుద్దపూసనా..? అంటే PCBలో ఎంత పెద్ద తప్పుచేసిన చర్యలు ఉండవు అని మిగతా అధికారులందరికీ చాలా మంచి సందేశాన్ని ఇస్తున్నారు. ఈ విషయాలన్నింటిపైన మరియు తెలంగాణ పర్యావరణాన్ని కాపాడుకోవడంపై పలువురు పర్యావరణ వేత్తలు, కాలుష్య బాధితులు ఓ ప్రముఖ హోటల్ లో సమావేశమై పలు విషయాలపై చర్చించి త్వరలోనే ఉమ్మడిగా కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్తామని తెలపడం జరిగింది.

✳️ అలాగే త్వరలో PCBలోని ఆ కొంతమంది అవినీతి అధికారుల తీరు, వారి అవినీతిపై.. PCBని పూర్తిగా ప్రక్షాళన చేయాలనే అంశంపై కాలుష్యంతో నష్టపోయిన బాధితులు, మేధావులు, పర్యావరణ వేత్తల ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్, లేదా బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్, హైదరాబాద్ లో త్వరలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సిఎస్) & PCB ఛైర్మన్, ప్రిన్సిపల్ సెక్రెటరీ దృష్టికి తీసుకువెళ్లడమే కాక.. అక్కడే ప్రెస్ మీట్ పెట్టి PCBలో జరుగుతున్న అన్ని విషయాలను తెలంగాణ ప్రజలు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు కాలుష్య బాధితులు, మేధావులు, పర్యావరణ వేత్తలు తెలిపారు. అవినీతిపైనే మా పోరాటం… తెలంగాణలో పర్యావరణాన్ని కాపాడుకోవడమే మా లక్ష్యం..