రాష్ట్ర సిగలో మరో మణిహారం: మంత్రి తుమ్మల నాగేశ్వర రావు

  • 22న నర్మెట్ట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభం
  • రైతు ఉత్సవాలకు ముస్తాబు అవుతున్న నర్మెట్ట కర్మాగార ప్రాంతం
  • ఉగాది పర్వదినాన సాయంత్రం 4 గంటలకు ప్రదర్శన శాలలను ప్రారంభించనున్న మంత్రి తుమ్మల
  • స్పీకర్, చైర్మన్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు ప్రజాప్రతినిధులందరికి ఇప్పటికే ఆహ్వానాలు అందచేసిన మంత్రి తుమ్మల
  • వ్యవసాయం, పశుసంవర్ధక మరియు అనుబంధ రంగాలకు సంబంధించి ఏర్పాటు కానున్న 150 స్టాల్స్
  • 22 వరకు కొనసాగునున్న రైతు ఉత్సవం

హైదరాబాద్ : రాష్ట్ర సిగలో మరో మణిహారంగా నిలిచే నర్మెట్ట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఈ నెల 22న ఘనంగా ప్రారంభంకానుంది. ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇలా ప్రజా ప్రతినిధులందరికీ ఆహ్వానాలు అందజేసినట్టు తెలిపారు. ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రభుత్వం నిర్వహించే రైతు ఉత్సవాల కోసం నర్మెట్ట కర్మాగార ప్రాంతం ముస్తాబు అవుతోంది. ఉగాది పర్వదినాన సాయంత్రం 4 గంటలకు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ప్రదర్శన శాలలను ప్రారంభించి ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. రాష్ట్ర సచివాలయంలో బుధవారం మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, వివేక్ వెంకటస్వామి గార్లతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ ఈ రైతు మహోత్సవంలో వ్యవసాయం, పశుసంవర్ధక , అనుబంధ రంగాలకు సంబంధించిన మొత్తం 150 స్టాల్స్ ఏర్పాటు కానున్నాయి. వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, మత్స్యశాఖల విభాగాలు, విశ్వవిద్యాలయాలు, బ్యాంకులు, ఎఫ్.పి.ఓలు, స్టార్టప్ కంపెనీలు మరియు ప్రైవేట్ సంస్థలు తమ ఆధునిక సాంకేతికతలు, సేవలు, అవకాశాలను రైతులకు పరిచయం చేయనున్నాయి. బ్యాంకులు, ఎఫ్.పి.ఓలు, స్టార్టప్‌లు, ప్రైవేట్ కంపెనీల నిపుణులు, శాస్త్రవేత్తలతో రైతులు నేరుగా ముఖాముఖి చర్చించే ప్రత్యేక వేదికను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది.
ఈ రైతు ఉత్సవం ఈ నెల 22 వరకు కొనసాగుతుంది. ప్రతి రోజు ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, మత్స్యశాఖ శాస్త్రవేత్తలు, అనుబంధ శాఖల అధికారులు, అవార్డు గ్రహీతలు,అభ్యుదయ రైతులతో ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహించబడతాయి.

ఈ నెల 22న సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నర్మెట్ట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ప్రారంభించి రైతన్నలకు అంకితం చేయనున్నారు. అదే రోజున ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ దగ్గర 80 కోట్లతో నిర్మించే రిఫైనరీ యూనిట్ కి శంకుస్థాపన కూడా చేయనున్నారు. కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి గారు రైతులతో వ్యవసాయరంగంలోని కీలక అంశాలపై ప్రత్యక్షంగా ముఖాముఖి మాట్లాడనున్నారు. అలాగే ఈ వేదిక నుండే ముఖ్యమంత్రిగారు రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నారు. నర్మెట్టలో ప్రారంభమవుతున్న ఈ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ రైతులకు మైలురాయిగా నిలవనుంది. దీని ద్వారా ఆయిల్ పామ్ రైతుల సమస్యలకు పరిష్కారం లభించడంతో పాటు రవాణా ఖర్చులు గణనీయంగా తగ్గి, రైతుల ఆదాయం పెరుగుటకు దోహదపడనుంది. రైతులు మరియు ప్రజా ప్రతినిధుల విజ్ఙప్తి మేరకు, కేంద్ర ప్రభుత్వం నుండి ఎటువంటి మద్ధతు లేకపోయిన గత ఖరీఫ్ లో మొక్కజొన్న కొనుగోళ్లు చేసినట్లు, ఈ యాసంగి కూడా ప్రభుత్వం కొనుగోళ్లు చేయడానికి సిద్ధంగా ఉందని మంత్రి ఈ సందర్భంగా అన్నారు.