భద్రాచల శ్రీ సీతారామచంద్రమూర్తి ఆలయ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

భద్రాచల శ్రీ సీతారామచంద్రమూర్తి ఆలయ అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. హాజరైన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వర్ రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, బలరాం నాయక్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సిఎం ప్రిన్సిపల్ సెక్రటరీలు శేషాద్రి, శ్రీనివాసరాజు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ హనుమంతరావు, ఆలయ ఈవో, పూజారులు, అధికారులు. ఇప్పటి వరకు పూర్తయిన భూసేకరణ అనుగుణంగా ఆలయ అభివృద్ధికి సంబంధించిన పలు డిజైన్లను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి. ఆలయ సహజత్వానికి భంగం కలగకుండా పూర్తిగా ఆగమశాస్త్రానుసారం అభివృద్ధి పనులు నిర్వహించాలని సూచించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మూడు దశల్లో ఆలయ అభివృద్ధి పనులను పూర్తి చేసేలా ప్రణాళికలుండాలని తెలిపిన ముఖ్యమంత్రి. వచ్చే గోదావరి పుష్కరాల నాటికి చేయగలిగిన పనులను ముందుగా గుర్తించి అంచనాలతో తొలి దశ అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. గోదావరి పుష్కరాల ప్రణాళికలకు అనుగుణంగా ఆలయ సమీపంలోని ఘాట్స్ నిర్మాణం, అభివృద్ధి ఉండాలన్నారు. 2027 మార్చి 31 నాటికి తొలిదశ అభివృద్ధి పనులు పూర్తిచేసేందుకు లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. పుష్కరాలు ముగిసిన అనంతరం మిగతా పనులు పూర్తి చేసేందుకు ఇప్పుడే ప్రణాళికలు, అంచనాలు సిద్ధం చేయాలని ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి.