తెలంగాణ మట్టిలో మాణిక్యాలను గుర్తిస్తాం: క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి

  • నిరంతర యజ్ఞంలా సీఎం కప్
  • క్రీడా ప్రతిభను ప్రోత్సహిస్తాం
  • సీఎం కప్ రాష్ట్ర స్థాయి ముగింపు వేడుకల్లో క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి

తెలంగాణ మట్టిలోని మాణిక్యాల క్రీడా ప్రతిభను సానపెట్టేందుకే సీఎం కపూర్ పోటీ నిర్వహించామని ఇది ఒక నిరంతర కార్యక్రమంలో గా కొనసాగిస్తామని రాష్ట్ర క్రీడలు యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఈరోజు ఎల్బీ ఇండోర్ స్టేడియంలో
రెండవ విడత సీఎం కప్ పోటీల ముగింపు ఉత్సవాలు రాష్ట్ర స్థాయి వివరాలు ఛాంపియన్షిప్ టీమ్లకు ప్రొసీల బహుకరణ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉన్న మట్టిలో మాణిక్యాలను గుర్తించేందుకే రెండు విడతలుగా సీఎం క పోటీలను ఘనంగా నిర్వహిస్తున్నామని ఒక నిరంతర ప్రక్రియ లాగా దీనిని ప్రతి సంవత్సరం కొనసాగిస్తామని తెలిపారు. క్రీడల్లో విజయం సాధించాలంటే కేవలం ప్రభుత్వ ప్రోత్సాహం మాత్రమే క్రీడాకారులకు కృషి పట్టుదల ఉండాలని అప్పుడు మాత్రమే క్రీడాకారులు చాంపియన్లుగా తీర్చిదిద్దబడతారని తెలిపారు. యువ క్రీడాకారులకు సైనా నెహ్వాల్ వంటి క్రీడాకారుల జీవితం స్ఫూర్తి కావాలని ఆయన అన్నారు.

సీఎం కప్ పోటీలో పాల్గొన్న క్రీడాకారుల ప్రతించి వారికి స్పోర్ట్స్ స్కూల్లో అకాడమీ లలో అవసరమైతే ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తామని తెలిపారు. స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేనారెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ క్రీడా ప్రతిభ గుర్తింపు కొరకే సీఎం కప్ పోటీలు నిర్వహిస్తున్నామని, ఇది నిరంతరం జరిగే ప్రక్రియ లాగా ముందుకు వెళ్తామని తెలిపారు. క్రమశిక్షణ కలిగిన క్రీడాకారులను గుర్తించి వారిని ప్రోత్సహిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారులు, ఏపీ జితేందర్ రెడ్డి మాట్లాడుతూ, సీఎం కప్ పోటీల విజయవంతంలో క్రీడా సంఘాల భాగస్వామ్యం ఎంతో ఉందని, ఎన్నో ప్రభుత్వ శాఖలు విభాగాలు సహకారం వల్లనే పోటీలు విజయవంతంగా కొనసాగాయని తెలిపారు. మేనేజింగ్ డైరెక్టర్ సోనీ బాలాదేవి మాట్లాడుతూ, సీఎం క పోటీలలో దాదాపు 5 లక్షల 40 వేల మంది క్రీడాకారులు ఆన్లైన్లో నమోదు చేసుకోగా, వారి సంపూర్ణ సమాచారాన్ని క్రీడా అవసరాలకు అనుగుణంగా క్రోడీకరిస్తున్నామని తెలిపారు. ఓవరాల్ ఛాంపియన్ గా అదిలాబాద్. గ్రామీణ మండల అసెంబ్లీ జిల్లా రాష్ట్రస్థాయి ఐదుఅంచల్లో కొనసాగిన ఈ పోటీల్లో అది ఉమ్మడి అదిలాబాద్ జిల్లా జట్టు ఓవరాల్ ఛాంపియన్ గా నిలబడగా, రెండో స్థానంలో రంగారెడ్డి జిల్లా మూడో స్థానంలో కరీంనగర్ జిల్లా నిలిచాయి. విజేతలకు మంత్రి వాకిటి శ్రీహరి స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి సైనా నెహ్వాల్ సోని బాలాదేవిలు ట్రోఫీలు అందజేశారు. సీఎం కప్ పోటీల విజయవంతంకి కృషిచేసిన వివిధ ప్రభుత్వ ప్రైవేటు సంస్థలకు స్పోర్ట్స్ అథారిటీ ఘనంగా సన్మానం చేసి జ్ఞాపికలను బహూకరించింది. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల డివైఎస్ఓ లు, క్రీడా సంఘాల ప్రతినిధులు స్పోర్ట్స్ అథారిటీ కోచులు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.