హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా గ్యాస్, పెట్రోల్, డీజిల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఆర్ధిక, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. నేడు శాసనమండలి సమావేశపు హాలులో రాష్ట్ర పౌర సరఫరాలు, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామ కృష్ణారావు లతో కలిసి గ్యాస్, పెట్రోల్ సరఫరాలను సమీక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్, గ్యాస్ నిల్వలు, పంపిణీలో ఎటువంటి ఇబ్బంది లేదని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. అపోహలు కలిగించే మాధ్యమాల కధనాలతో ఆందోళన చెందవద్దని వినియోగదారులకు సూచించారు. రెగ్యులర్ గా కొనుగోలు చేసే దాని కంటే, ఎక్కువగా కొని నిల్వ చేయవద్దని వాహనదారులకు విజ్ఞప్తి చేశారు. బంకుల వద్దకు వచ్చే చివరి వాహనదాదారునికి కూడా పెట్రోల్, గ్యాస్ దొరుకుతుందనే భరోసా కల్పించాలని అధికారులు, ఏజెన్సీ లను ఆదేశించారు. ప్రజల్లో నమ్మకాన్ని పెంచుటకు రెగ్యులర్ గా ప్రెస్ బ్రీఫింగ్స్ ఇవ్వాలని సూచించారు. బ్లాక్ మార్కెట్ చేసే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులని ఆదేశించారు. పెట్రోల్, గ్యాస్ ఏజెన్సీ లకు ప్రభుత్వం పూర్తి
సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. ఈ సమీక్షలో పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, GHMC కమిషనర్ RV కర్ణన్, పోలీసు కమిషనర్లు సజ్జన్నార్, సుధీర్ బాబు, IOCL, HPCL, BPCL ఏజెన్సీల ప్రతినిధులు, పౌర సరఫరాల శాఖ అధికారులు పాల్గొన్నారు.