- స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు
- అందరికీ ఆహ్వానం
ఎల్బీ స్టేడియంలో ప్రారంభం కాబోతున్న శాసనసభ్యుల క్రీడోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి అన్నారు. ఈరోజు నుంచి ఎల్ బి స్టేడియంలో ప్రారంభం కానున్న ఫస్ట్ ఎడిషన్ లెజిస్టేటివ్ స్పోర్ట్స్ మీట్ 2026 ఏర్పాట్లను ఆయన స్పోర్ట్స్ అథారిటీ ఎండి డాక్టర్ సోనీ బాలాదేవి తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో అన్ని వర్గాల్లో క్రీడల పట్ల అవగాహన తీసుకురావడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న శాసనసభ్యుల క్రీడోత్సవ పోటీలను ఘనంగా నిర్వహించబోతున్నామని, తద్వారా రాష్ట్రంలో క్రీడల పట్ల అవగాహన ఆసక్తి పెంచేందుకు ఈ కార్యక్రమాన్ని వినియోగించబోతున్నామని తెలిపారు. దాదాపు 14 సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా నిర్వహించబోతున్న ఈ క్రీడా పోటీలలో పార్టీల భేద భావాలు లేకుండా, అన్ని పక్షాల శాసనసభ్యులు శాసనమండలి సభ్యులు భాగస్వామ్యం కావడం సంతోషకరమనిఅన్నారు. ఈ ప్రారంభోత్సవ వేడుకల్లో టగ్ ఆఫ్ వార్, ఫుట్బాల్ క్రికెట్ అథ్లెటిక్స్, కబడ్డీ,వాలీబాల్ బాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, తోపాటు కొన్ని రిక్రియేషనల్ క్రీడా పోటీలు నిర్వహించబోతున్నయని తెలిపారు. ఈ పోటీలు వీక్షించడానికి అందరికీ ఉచిత ప్రవేశం కల్పించబోతున్నామని, అందరికీ అవసరమైన సౌకర్యాలను సమకూర్చామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ అథారిటీ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు