మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా బాలానగర్ మండలం, గ్రామంలోని అక్షయ ఎన్‌క్లేవ్ పేరుతో1983 వ సంవత్సరంలో 7.12 ఎకరాల్లో లే ఔట్ వేశారు. హుడా అనుమతి పొందిన లే ఔట్‌లో 968 గజాల మేర ఉన్న పార్కును తప్పుడు పత్రాలతో అబ్దుల్ రెహ్మాన్ అలియాస్ గోపాల్ అనే వ్యక్తి కొట్టేయాలని ప్రయత్నిస్తున్నారని స్తానికులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. క్షేత్రస్థాయిలో ఈ ఫిర్యాదును పరిశీలించిన హైడ్రా అధికారులు పార్కు స్థలంగా నిర్ధారించుకున్నారు. ఇప్పటికే జీహెచ్ ఎంసీ ప్రహరీ నిర్మించి గేటు కూడా పెట్టిన విషయాన్ని గుర్తించారు. 2019లో తప్పుడు పత్రాలతో నిర్మాణ అనుమతులు కూడా తెచ్చుకుని ఆక్రమణలకు సిద్ధం కగా.. కబ్జాదారులపై జీహెచ్ ఎంసీ అధికారులతో పాటు.. సొసైటీ ప్రతినిధులు కూడా కేసులు పెట్టారు. 968 గజాల పార్కు స్థలంలో కబ్జాదారులు వేసిన సామగ్రీని తొలగించి పార్కు స్థలంగా పేర్కొంటూ హైడ్రా బోర్డులు ఏర్పాటు చేశారు.మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా బాలానగర్ మండలం, గ్రామంలోని అక్షయ ఎన్‌క్లేవ్ పేరుతో1983 వ సంవత్సరంలో 7.12 ఎకరాల్లో లే ఔట్ వేశారు. హుడా అనుమతి పొందిన లే ఔట్‌లో 968 గజాల మేర ఉన్న పార్కును తప్పుడు పత్రాలతో అబ్దుల్ రెహ్మాన్ అలియాస్ గోపాల్ అనే వ్యక్తి కొట్టేయాలని ప్రయత్నిస్తున్నారని స్తానికులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. క్షేత్రస్థాయిలో ఈ ఫిర్యాదును పరిశీలించిన హైడ్రా అధికారులు పార్కు స్థలంగా నిర్ధారించుకున్నారు. ఇప్పటికే జీహెచ్ ఎంసీ ప్రహరీ నిర్మించి గేటు కూడా పెట్టిన విషయాన్ని గుర్తించారు. 2019లో తప్పుడు పత్రాలతో నిర్మాణ అనుమతులు కూడా తెచ్చుకుని ఆక్రమణలకు సిద్ధం కగా.. కబ్జాదారులపై జీహెచ్ ఎంసీ అధికారులతో పాటు.. సొసైటీ ప్రతినిధులు కూడా కేసులు పెట్టారు. 968 గజాల పార్కు స్థలంలో కబ్జాదారులు వేసిన సామగ్రీని తొలగించి పార్కు స్థలంగా పేర్కొంటూ హైడ్రా బోర్డులు ఏర్పాటు చేశారు.