రాష్ట్రానికి మానవీయ కోణం ఉంది అంతరాలు లేని సమాజం నిర్మాణమే మా లక్ష్యం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

  • కోరితెచ్చుకున్న తెలంగాణ ప్రజలచే పాలించాలి, ఫ్యూడల్స్ తో కాదు
  • ప్రజలే కేంద్రంగా మా పాలన, ప్రజల ఆలోచన మా విధానం
  • ఈ రాష్ట్రంలో పుట్టడం మా అదృష్టం అన్న రీతిలో పరిపాలన సాగుతుంది, ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నాం

పిప్రిలో బహిరంగ సభ నా ఆలోచన కాదు ముఖ్యమంత్రి ఆలోచన అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలకు సంబంధించి చర్చిస్తున్న క్రమంలో ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అధికారుల ద్వారా నిర్వహిస్తున్న 99 రోజుల కార్యక్రమంలో భాగంగా భారీ బహిరంగ సభ నిర్వహిద్దామని సీఎం అన్నారు. పిప్పిరి నుంచి ఖమ్మం వరకు మీరు నడుస్తూ ప్రజలకు అనేక హామీలు ఇచ్చి ఉంటారు ప్రజలు చెప్పిన అనేక సమస్యలు విని ఉంటారు వాటిని వెంటనే సాంక్షన్ చేసి అమలు చేయాల్సిన బాధ్యత మనపై ఉందని, పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మీరు ఇచ్చిన హామీలు అన్ని అమలు చేసి నిజం చేద్దాం, అదే నిజమైన ప్రజా పాలనాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారు. ఈ భారీ బహిరంగ సభకు సీఎం గారే కారణం. మండుటెండల్లో ఆనాడు నాతో నడిచి పాదయాత్రను విజయవంతం చేశారు ఈరోజు 1238 కోట్ల విలువైన పనులు అన్నిటికీ సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు అని డిప్యూటీ సీఎం తెలిపారు.

ఇది ఒక రాజకీయ సభ కాదు ఆనాడు నేను ప్రజలతో ఏర్పరచుకున్న అనుబంధం ఈ సభ అని డిప్యూటీ సీఎం తెలిపారు. ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు శంకుస్థాపన చేసుకునే కార్యక్రమం ఇది అని డిప్యూటీ సీఎం అన్నారు. అధికారంలోకి రావడానికి రాజకీయ పార్టీలు అనేక హామీలు ఇస్తాయి కానీ అధికారంలోకి రాగానే మర్చిపోతాయి, కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వం లోని యావత్ క్యాబినెట్ మేం పాలకులం కాదు సేవకులు అని ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్నామని తెలిపారు. అధికారం అంటే హోదా అని అధికారం అంటే పెత్తనం చేయడమే అనే ఆలోచన సీఎం రేవంత్ రెడ్డి కి గాని డిప్యూటీ సీఎం గా నాకు కానీ మా క్యాబినెట్ సభ్యుల ఎవరికి ఆ ఆలోచన లేదు అన్నారు. అందుకే అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల కాలంలోనే 99% హామీలు అమలు చేసిన గొప్ప ప్రభుత్వం మాది అన్నారు. ఈ ఉమ్మడి ఆదిలాబాద్ ప్రాంతంలో నడుస్తున్నప్పుడు ఇల్లు లేదని 10 సంవత్సరాలుగా ఇల్లు కోసం గోడు వెళ్ళబోసుకుంటున్నామని అనేకమంది ఎన్నికల ముందు ఆవేదన వ్యక్తం చేశారు ఓవైపు పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి సీఎల్పీ నేతగా నేను పాదయాత్ర చేశా ము. ఆనాడు మాతో గోడు వెళ్ళబోసుకున్న ఆడబిడ్డల మాటలను దృష్టిలో పెట్టుకొని అధికారంలోకి రాగానే 22,500 కోట్లతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభించాం ఒక్కో ఇంటిని 5 లక్షల వ్యయంతో నిర్మిస్తున్నాం. నియోజకవర్గానికి 3500 చొప్పున రాష్ట్రంలో నాలుగున్నర లక్షల ఇళ్లను మంజూరు చేసి నిర్మాణాలు ప్రారంభించి చిత్తశుద్ధిని చాటుకున్న ప్రభుత్వం తమది అని డిప్యూటీ సీఎం తెలిపారు.

రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్లు రైతుల ఖాతాల్లో సభ చేశాం నిన్న కూడా ప్రతి రైతు ఖాతాలో రైతు భరోసా నిధులు విడుదల చేశామని తెలిపారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అందజేస్తున్నామని, రాష్ట్రంలోని ఆడబిడ్డలు ఏ మూల నుంచి ఏ మూలకైనా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించేందుకు వారిని మహాలక్ష్మిలుగా భావిస్తూ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాం. ప్రమాణ స్వీకారం చేసిన అర్థగంటలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి తీసుకువచ్చాను ఇప్పటివరకు 300 కోట్ల సార్లు మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేశారు మహిళల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి అది వేల కోట్లు చెల్లించిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి మానవీయ కోణం ఉంది అంతరాలు లేని సమాజం నిర్మించాలన్న ఆలోచనతో ప్రపంచంతో మన బిడ్డలు పోటీపడేలా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన చేశారు. ఒక్కో పాఠశాలను 200 కోట్లతో 25 ఎకరాల్లో నిర్మిస్తున్నారు దేశంలోని ఏ రాష్ట్రంలో ఈ తరహా పాఠశాలలు లేవు . అన్ని వర్గాల పిల్లలను ఒకే దగ్గర చదివిస్తూ వసుదైక కుటుంబం గా రాష్ట్రం ఎదగాలన్నదే సీఎం ఆలోచన అని తెలిపారు. ఈరోజు ఒక్కరోజే మూడు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలకు శంకుస్థాపన చేసినట్టు తెలిపారు.

రాష్ట్రంలో ఇచ్చిన హామీలు అమలు చేయడమే కాదు కొత్తగా అనేక పథకాలు అమలు చేస్తుంటే ఇతర రాష్ట్రాల నుంచి ఫోన్లు చేసి మీ రాష్ట్రంలో ఎన్ని పథకాలు ఎలా అమలు చేయగలుగుతున్నారని ఆశ్చర్యపోతూ అడుగుతున్నారని డిప్యూటీ సీఎం వివరించారు. ఇంటి పెద్ద కు అనుకోని ప్రమాదం జరిగితే భరోసాగా నిలవాలన్న ఆలోచనతో రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి 5 లక్షల ఇందిరమ్మ ప్రమాద బీమా సౌకర్యం కల్పించాం. ఆదిలాబాద్ లాంటి జిల్లాల్లో బిడ్డలు పాఠశాలకు వెళ్లాలంటే అర్ధాకలితో ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు తలకెక్కని పరిస్థితి, రాష్ట్రంలోని ఏ బిడ్డ కాలేకడుపుతో బడికి వెళ్ళవద్దని భావించిన సీఎం ప్రతిబిడ్డ బడికి రాగానే ఉదయం అల్పాహారంతో పాటు రాగి జావా లేదంటే పాలు ఇవ్వాలని నిర్ణయించాం అని తెలిపారు. అక్షరాన్ని ఆయుధంగా మార్చుకొని తన కుటుంబాన్ని కాదు రాష్ట్రాన్ని పైకి తెస్తారని విద్య కోసం ఎన్ని కోట్లయినా ఖర్చు పెట్టడానికి ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారు అని డిప్యూటీ సీఎం వివరించారు. ఈ రాష్ట్రంలో పుట్టడం పెరగడం అదృష్టంగా ప్రజలు భావించాలి అన్న రీతిలో పరిపాలన సాగుతుంది. ఎంతో దూరం నుంచి ఎండలో పెద్ద సంఖ్యలో ప్రజలు సభకు తరలివచ్చారు సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం గా నేను క్యాబినెట్ సహచరులం అందరం గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చాం, పేదలు రైతుల పరిస్థితి తెలిసిన వాళ్లమని డిప్యూటీ సీఎం వివరించారు. ప్రజలే కేంద్రంగా పాలన సాగాలి ప్రజల ఆలోచన మా విధానం ప్రజల ఆలోచన మా ఎజెండా అన్నారు. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలతో రాష్ట్రం పోటీ పడాలనేదే మా క్యాబినెట్ ఆలోచన, మాకు వ్యక్తిగత అజెండాలు లేవు అని డిప్యూటీ సీఎం తెలిపారు.

రాష్ట్రం బాగుపడాలి, మహిళలు, పేదలు బాగుపడాలి
కోరి తెచ్చుకున్న తెలంగాణ ప్రజల చేత పరిపాలించబడాలి ఫ్యూడల్స్ ద్వారా కాదు అని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. ప్రజల చేత ప్రజల కొరకు ఏర్పడిన, ప్రజల కోసం ఆలోచన చేసే ప్రభుత్వాన్ని గుండెలో పెట్టుకొని కాపాడుకోవాలి అన్నారు. సీఎల్పీ నేతగా తాను పిప్రి నుంచి మొదలుపెట్టిన పాదయాత్ర, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ సభలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నాం ప్రజలకు చేరవేస్తున్నాం పైసా పైసా పోగు చేస్తాం ప్రజలకే పంచుతాం అన్నారు. నిరుద్యోగ యువత స్వయం ఉపాధి కోసం రాజీవ్ యువ వికాసం, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం అన్నారు.