జీవీకే – ఈఎంఆర్‌ఐలో ఉద్యోగావకాశాలు..

జీవీకే – ఈఎంఆర్‌ఐ సంస్థలో ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ (ఈఎంఈ) పోస్టుల భర్తీకి 29న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు సంస్థ ప్రాంతీయ మేనేజర్‌ ఎంఏ ఖలీద్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ విద్యార్హత ధ్రువీకరణ పత్రాలతో కింగ్‌కోఠి జిల్లా దవాఖాన ప్రాంగణంలోని జీవీకే – ఈఎంఆర్‌ఐ 108 ప్రాంతీయ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరుకావాలని సూచించారు. ఎంపికైన వారు తెలంగాణలో ఎక్కడైనా పనిచేయాల్సి ఉంటుందని, ఇతర వివరాల కోసం 81433 35660 నంబర్‌లో సంప్రదించాలన్నారు.