భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చూపించిన బాటలో సమాజమంతా ముందుకు ప్రయాణం చేయాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణి ప్రసాద్ పిలుపునిచ్చారు. ఇప్పుడు దేశంలో నిజమైన ప్రగతి అంటే అన్ని వర్గాలకు సమంగా అందే అభివృద్ధి మాత్రమే అని చెబుతూ అంబేద్కర్ చలనచిత్రాన్ని తెలుగు లలిత కళా తోరణంలో ప్రారంభించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలంగాణ భాషా సంస్కృతిక శాఖ తెలుగు లలితకళా తోరణంలో అంబేద్కర్ చలనచిత్రాన్ని ఓపెన్ థియేటర్లో ప్రజల కోసం ఉచితంగా ప్రదర్శించింది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ వాణి ప్రసాద్ గారు ఈ చలన చిత్రాన్ని పూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టూరిజం కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమి, పురావస్తు శాఖ సంచాలకులు అర్జున్ రావు, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు ఏనుగు నరసింహారెడ్డి, భాషా సాంస్కృతిక శాఖ సలహా మండలి సభ్యులు దినకర్, పల్లె నర్సింహ తదితరులు పాల్గొన్నారు.