బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి

చీకట్లో దడుచుకుంటే ఒక చెట్టే నీ చుట్టూరా అరణ్యమై భయపెడుతది… గుండె ధైర్యం ఉంటే అదే నీవెంట పెద్ద సైన్యమై నడుస్తుందని, ఇదే ప్రాంతానికి చెందిన కవి అలిశెట్టి ప్రభాకర్ అన్నారు.

♦️ జీవన్ రెడ్డి గుండె ధైర్యం ఉన్నోడు.
♦️ జీవన్ రెడ్డి గురించి ఎక్కువ చెబితే మాకు మేము డబ్బా కొట్టుకున్నట్లు ఉంటుంది.
♦️ జీవన్ రెడ్డి నేను మంచి స్నేహితులం, పార్టీలు వేరైనా కలిసి పనిచేశాము.
♦️ జగిత్యాల ప్రజల దీవెనలతో ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా జీవన్ రెడ్డి గెలిచారు.
♦️ ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో జీవన్ రెడ్డికి అనేక మంది అభిమానులు ఉన్నారు.
♦️ జగిత్యాల అభివృద్ధి కోసం నిరంతరం జీవన్ రెడ్డి పాటుపడేవాడు.
♦️ జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరితే బీఆర్ఎస్ పార్టీకి లాభ నష్టాలపై సర్వేలు వచ్చాయి.
♦️ జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరితే బీఆర్ఎస్ పార్టీకి లాభం చేకూరుతుందని సర్వేలు చెప్పాయి.
♦️ ఎమ్మెల్యేగా జీవన్ రెడ్డి ఓడిపోయినా.. పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఆయన్ని ఈ ప్రాంత ప్రజలు
గెలిపించారు.
♦️ జీవన్ రెడ్డికి పదవులు కొత్తేం కాదు
♦️ జీవన్ రెడ్డి, నేను కలిసినప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కుటుంబ సభ్యులు
♦️ పార్టీ ప్రధాన కార్యదర్శిగా జీవన్ రెడ్డిని నియమిస్తున్న.
♦️ జీవన్ రెడ్డి ఉమ్మడి కరీంనగర్‌తో పాటుగా, పార్టీ బలోపేతం కోసం తెలంగాణ రాష్ట్రంలో
అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తారు.
♦️ ఆరు నూరైనా వందకు వంద శాతం బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది
♦️ బీఆర్ఎస్ అధికారంలో రాగానే జీవన్ రెడ్డికి మంచి పదవి వస్తుంది.
♦️ ఇక నుంచి జగిత్యాల యుద్ధం జగిత్యాల ప్రజల వంతు అయితే, తెలంగాణ యుద్ధం కేసీఆర్ వంతు.
♦️ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తెలంగాణకు జరుగుతున్న అన్యాయం చూసి చలించి
పోయేవాడిని.
♦️ అసెంబ్లీలో తెలంగాణ మాటే అనొద్దనీ మనపై భయంకరమైన దాడి జరిగేది.
♦️ మెట్‌పల్లి ప్రాంత ప్రజలు సైతం దుబాయ్, బొంబాయి వలస పొయ్యేవాళ్ళు.
♦️ పాలమూరు అయితే నూటికి నూరు శాతం వలస వెళ్ళేది.
♦️ నా తెలంగాణలో గంజి కేంద్రాలు పెట్టే పరిస్థితికి వచ్చినప్పుడు, అది చూసి చలించిపోయేవాడిని.
♦️ ఆనాడు తెలంగాణ కోసం ఎవరు మాట్లాడలేక పోతుండే
♦️ ఆ సమయంలో చంద్రబాబు నాయుడు కరెంట్ ఛార్జీలు పెంచితే, తగ్గించమని నేను లెటర్
రాశాను.
♦️ కరెంట్ ఛార్జీలు తగ్గించమని ప్రజలు రోడ్ల పైకి వస్తే బషీర్‌బాగ్‌లో మిట్ట మధ్యాహ్నం ప్రజలను పిట్టల్లా కాల్చివేశారు.
♦️ అది చూసి నా మనస్సు చలించిపోయింది, లాభం లేదు తెలంగాణ కోసం ఒక్కడినే బయలుదేరిన.
♦️ తెలంగాణ కోసం నేను బయలుదేరితే నన్ను చాలా మంది అవమానించారు.
♦️ అవమానాలు తట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాము.
♦️ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత మొట్టమొదటి కార్యక్రమం మిషన్ కాకతీయ.
♦️ చెరువులు బాగు చేసుకుంటే చెరువుల క్రింద పొలాలు బాగా పండుతాయని ఆలోచన చేసిన.
♦️ ఇంటింటికి నీళ్ళు ఇవ్వకపోతే రాబోయే ఎన్నికల్లో ఓట్లు అడగను అని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన.
♦️ 5 యేండ్ల పాటు మిషన్ భగీరథతో ఇంటింటికి నీళ్ళు ఇస్తే, ఇప్పుడు ఎందుకు రావడం లేదో చెప్పాలి.
♦️ మిషన్ భగీరథ నీళ్లు రాకపోతే లాగులు పగిలేదాక చంపాలి కదా, ఏం చేస్తున్నట్లు?
♦️ పొద్దున లేస్తే కేసీఆర్ చావాలని మాట్లాడుతున్నారు, నా కొడక నేను సచ్చేది లేదు
♦️ ఓట్లు వేసేటప్పుడు చిలక్కి చెప్పినట్లు చెప్పిన, నా మాట కొంతమంది విన్నారు కొంతమంది వినలేదు.
♦️ నేను ఇక్కడ సభ పెడితే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేడిగడ్డలో సభ పెట్టారు.
♦️ ఒకే దఫా వేయాల్సిన రైతుబంధు నెలకు ఒకసారి వేస్తున్నారు.
♦️ డబ్బులు లేక చిప్ప పట్టుకొని అడుక్కుంటున్నారు.
♦️ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత చిల్లర మాటలే తప్ప, ఒక్కటంటే ఒక్కక కార్యాచరణ లేదు.
♦️ యూరియా బస్తా కోసం యాప్‌లు పట్టుకొని తిరుగుతున్నారు.
♦️ యాప్‌లు పట్టుకొని తిరిగితే కాళ్లకి వాపులు వస్తున్నాయి.
♦️ బీఆర్ఎస్ హయాంలో ఆటో అతనికి ఫోన్ చేస్తే ఎన్ని అంటే యూరియా బస్తాలు తెచ్చి ఇంట్లో వేస్తుండే.
♦️ బీఆర్ఎస్ హయంలో రూ.75 వేల కోట్లు రైతుల కోసం ఖర్చు చేశాము.
♦️ రాష్ట్ర ఆదాయం దిగజారిపోయింది.
♦️ కేసీఆర్ ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ అద్భుతంగా ఉండేది.
♦️ ఈరోజు భూమి అమ్మేవాడు ఉన్నడు, కానీ కొనేవాడే దిక్కులేదు.
♦️ మంచి నీళ్ల కోసం గోసపడే పరిస్థితి వచ్చింది, మక్కలు కొనే పరిస్థితి లేదు.
♦️ పంట వేసిన దగ్గర నుంచి కొనేవరకు బీఆర్ఎస్ రైతులకు అండగా నిలబడింది.
♦️ చేనేత కార్మికులు అవస్థ పడుతున్నారు.
♦️ బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగులను ఇవ్వాల్సిన PRC ఇచ్చాము.
♦️ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత రిటైర్డ్, ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వలేక పోతున్నారు.
♦️ రాష్ట్రంలో ఎవ్వరిని కదిలించినా ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు.
♦️ కాంగ్రెస్ పార్టీ కాకి మాటలే చెప్పింది తప్ప, ఒక్కరికి మంచి చెయ్యలేక పోతుంది.

♦️ మున్సిపాలిటీలు మురికి కూపాలుగా అయిపోయాయి.
♦️ అందుకే జీవన్ రెడ్డి లాంటి, సీనియర్ నేత నోటి నుంచి కాంగ్రెస్ పోవాలి, బీఆర్ఎస్ రావాలి అనే మాట వచ్చింది.
♦️ హైడ్రా తెచ్చారు, నిజామాబాద్ నీడ్రా, జగిత్యాలలో జీడ్రా తెస్తామని PCC అధ్యక్షుడు అంటున్నారు.
♦️ బీఆర్ఎస్ అధికారంలోకి మొదటి సంతకంతోనే హైడ్రా తీసి అవతల పడేస్తాం.
♦️ మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇండ్లు కూల్చుతామని అంటున్నారు.
♦️ మూసీ సుందరీకరణ చెయ్యాల్సిందే, అంతేగాని పేదల ఇండ్లు కూల్చవద్దు.
♦️ మూసీ నగర ప్రజల కోసం కాదు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే.
♦️ ఏ రంగంలో చూసినా ఒక రకమైన దోపిడి గూండాగిరే చేస్తున్నారు.
♦️ కరెంట్ మోటార్లకు మీటర్ పెట్టమని ఆనాడు మోడీ నా మెడపై కత్తి పెట్టిండు.
♦️ రైతుల కోసం మీటర్ పెట్టనియ్యకుండా అడ్డుకున్నాను
♦️ మీటర్ పెడితే కేంద్రం ఇచ్చే డబ్బుల కోసం ఈ ప్రభుత్వం సంతకం పెట్టింది.
♦️ యాదవులకు గొర్రె పిల్లలు, ముదిరాజ్‌లకు చేప పిల్లలు ఇవ్వడం లేదు.
♦️ బీఆర్ఎస్ హయాంలో బీడీ కార్మికులకు పింఛన్లు ఇచ్చాము
♦️ 6 గ్యారంటీలు, 420 హామీలతో ప్రజలను మోసం చేశారు.
♦️ తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం మళ్ళీ మొదలు కావాల్సిందే.
♦️ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పూర్తి చెయ్యకుండా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది
♦️ ఈ ప్రభుత్వం తీరు కూల్చివేతలు, కాల్చివేతలు తప్ప ఏం లేదు
♦️ తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం జగిత్యాల జైత్రయాత్ర నుంచే మొదలు కాబోతుంది.
♦️ ఇవ్వాళ నా కండ్ల ముందు ఉన్న మీరు, మీ కంటే రెండింతలు బయట ఉన్న అశేషమైన జీవన్ రెడ్డి అనుచరులు నా వెంట ఉన్నారు.