గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న పలువురు సినీ నటులు…

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో సినీ నటులు పాల్గొని మొక్కలు నాటారు. కార్యక్రమంలో తులసి, వై విజయ, జూనియర్‌ రేలంగి, శశాంక, గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ ప్రతినిధి కదంబరి కిరణ్‌, కిశోర్‌ దాస్‌, దర్శకుడు రామకృష్ణ, కెమెరామెన్‌ జగదీశ్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… సినిమా షూటింగ్‌ కోసం హైదరాబాద్‌ వచ్చాము. ఇక్కడ ఎంపీ సంతోష్‌కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటి మరో ముగ్గురికి నాటాలని ఛాలెంజ్‌ విసరడం చాలా ఆనందంగా ఉంది. బర్త్‌డేలు, పెండ్లి రోజులు, ఇతర వేడుకల సందర్భంగా మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.