ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ బలవన్మరణం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షణికావేశంలో ఆయన తీసుకున్న ఈ నిర్ణయం ఆ కుటుంబాన్ని కోలుకోలేని దుఃఖసాగరంలో ముంచేసిందన్నారు. శంకర్ గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అన్నారు.. శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉండి వారిని ఆదుకుంటం అన్నారు.
కార్మికులందరికీ ఒక్కటే విజ్ఞప్తి.. దయచేసి సంయమనం పాటించండి. ఎటువంటి తొందరపాటు చర్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వానికి పూర్తి చిత్తశుద్ధి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.