రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమారు చేపట్టీన ప్రతిష్టాత్మకమైన గ్రీన్ ఇండియా చాలేంజ్ లో భాగంగా సంగారెడ్డి జిల్లా లోని పోతిరెడ్డి పల్లీ గ్రామంలో ని అంగన్ వాడి కేంద్రం లో చిన్నారుల తో మొక్కలు నాటించటం జరిగింది. మహిళ శిశు సంక్షేమ అదికారి రేణుక, అంగన్ వాడి సూపర్ వైజర్ జ్యోతి స్కూల్ టీచర్ అనిత విధ్యార్ధుల తల్లీదండ్రులు పాల్గొన్నారు .ఈ సందర్భంగా సిడిపివో అధికారిణి రేణుక మాట్లాడుతూ పిల్లలకు మొక్కల పెంపకం , వాటి ప్రాధాన్యత చిన్నప్పటి నుంచి నేర్పాలి, దానివల్ల జాలి, దయ పిల్లలకు ఏర్పడుతుంది అని అన్నారు . పరోక్షంగా పర్యావరణ పరిరక్షణకు వారు కూడా బాల్యం నుంచే భాగస్వామ్యం అవడం జరుగుతుంది అని అన్నారు. ఈ సందర్భంగా ఉపాద్యాయులు , ఎంపీ సంతోష్ కుమార్ ని ఆదర్శంగా తీసుకోవాలని పిల్లలకు సూచించారు. ఈ వేసవి దృష్టిలో ఉంచుకుని నీటి సౌలభ్యం ఉన్న ప్రాంతాల్లో మొక్కలు నాటి , పెట్టిన మొక్కలు ఎదిగేందుకు బాధ్యత వహించాలని ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ భాగస్వామ్యులను కోరారు .