- మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశాం
- తుమ్మడిహట్టి నుండి ఎల్లంపల్లికీ నీటిని తరలించి లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించేందుకు భగీరథ ప్రయత్నం చేస్తున్నాము
- తుమ్మిడిహట్టి నుండి ఎల్లంపల్లికీ ప్రత్యామ్నాయ ప్రతిపాదనలను పరిశీలిస్తున్నాము
- ఆర్వీ అసోసియేట్స్ ,ఐ ఐ టి హైదరాబాద్ వారు సమిష్టిగా నాలుగు ప్రతిపాదనలు ప్రభుత్వం ముందుకు తెచ్చారు
- ప్రతీ ప్రతిపాదనకు అయ్యో ఖర్చు,అనుకూల ,ప్రతీ కూలతలపై క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం
- ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డితో జరగనున్న సమీక్షా సమావేశంలో సమీక్షించి తగు నిర్ణయం తీసుకుంటాం
- మెడిగడ్డ, సుందిళ్ల, అన్నారం పునరుద్ధరణ కు అవసరమైన పరీక్షలను వర్షాకాలం లోపు పూర్తి చేయాలి
- ప్రతీ 1.5 మీటర్ల దూరంలో ఎస్.పి.టి టెస్ట్ లు నిర్వహించాలి
- ప్రతీ మూడు మీటర్ల దూరంలో పెర్మిబిలిటీ టెస్ట్ లు జరపాలి
- బోర్లు వేస్తున్న సమయంలో రాయి వచ్చినప్పటికీ రాయి లోపటికి 5 మీటర్లు లోతుగా బోర్లు వెయ్యాలి
- బ్యారేజ్ ల పునరుద్ధరణ కోసం నియమించిన సమన్వయ కమిటీ బ్యారేజ్ లను సందర్శించి టైంలైన్ ను ఫిక్స్ చేసుకోవాలి
- CWPRS డైరెక్టర్ క్షేత్ర స్థాయిలో ఉంటూ పునరుద్ధరణకు అవసరమైన పనులు త్వరితగతిన పూర్తి అయ్యేలా చూడాలి
- పునరుద్ధరణ కోసం జరుగుతున్న పురోగతి పనుల వివరాలను ఎప్పటికప్పుడు NDSA కు సమగ్రంగా సమాచారం అందించాలి
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర నీటిపారుదల,పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీకి కట్టుబడి ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ఆయన వెల్లడించారు. తుమ్మిడిహాట్టి నుండి ఎల్లంపల్లికి ప్రత్యామ్నాయ మార్గాలతో పాటు మెడిగడ్డ, సుందిళ్ల, అన్నారం పునరుద్ధరణ పనులపై బుధవారం ఉదయం కుందన్ బాగ్ లోని ఆయన క్యాంప్ కార్యాలయంలో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. నీటిపారుదల శాఖా ప్రధాన కార్యదర్శి ఇ. శ్రీధర్ సహాయ కార్యదర్శి కే. శ్రీనివాస్ ఇ. ఎన్.సి రమేష్ బాబు, జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ రోహిత్ శర్మ,ఆర్వీ అసోసియేట్స్,ఐఐటీ హైదరాబాద్ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
తుమ్మిడిహట్టి నుండి ఎల్లంపల్లికీ నీటిని తరలించి లక్షలాది ఎకరాలకు సాగు నీరు అందించేందుకు భగీరథ ప్రయత్నం చేస్తున్నామన్నారు. తుమ్మిడిహట్టి నుండి ఎల్లంపల్లికీ నీటిని తరలించేందుకు గాను ప్రత్యామ్నాయ మార్గాలపై అధ్యయనం చేయాలని ఆర్వీ అసోసియేట్స్, ఐఐటీ హైదరాబాద్ కు బాధ్యత అప్పగించామని ఆయన తెలిపారు. వారు నాలుగు ప్రతిపాదనలను ప్రభుత్వం ముందు ఉంచారని ఆయన వెల్లడించారు. ప్రభుత్వం ముందుకు వచ్చిన నాలుగు ప్రతిపాదనలపై ప్రభుత్వం లోతుగా పరిశీలిస్తున్నామని తెలిపారు. ప్రతీ ప్రతిపాదనకు అయ్యో ఖర్చు అనుకూల, ప్రతీకూల పరిస్థితిలపై అధ్యయనం చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ రోజు సాయంత్రం ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి తో జరగనున్న ప్రత్యేక సమీక్షా సమావేశంలో ఆ నాలుగు ప్రతిపాదనలపై సమీక్షించి తగు నిర్ణయం తీసుకొనున్నట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా మెడిగడ్డ, సుందిళ్ల, అన్నారం పునరుద్ధరణకు అవసరమైన పరీక్షలన్నింటినీ వర్షాకాలం ప్రారంభం లోపు పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణలో విధిగా నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు. ప్రతీ 1.5 మీటర్ల దూరంలో ఎస్.పి.టి పరీక్షలు నిర్వహించాలని ఆయన సూచించారు. అదే విదంగా ప్రతీ మూడు మీటర్ల దూరంలో పెర్మిబిలిటి టెస్ట్ లు జరపాలి అన్నారు. బోర్లు వేస్తున్న సమయంలో రాయి వచ్చినా ఐదు మీటర్ల లోతుగా బోర్లు వేయాలన్నారు. బ్యారేజ్ ల పునరుద్ధరణ కోసం నియమించిన సమన్వయ కమిటి బ్యారేజ్ లను సందర్శించిన టైంలైన్ ను నిర్దేశించు కోవాలని ఆయన అధికారులకు చెప్పారు. CWPRS డైరెక్టర్ క్షేత్రస్థాయిలోb ఉంటూ పునరుద్ధరణకు అవసరమైన పనులు త్వరితగతిన పూర్తి అయ్యేలా చూడాలన్నారు. అదే సమయంలో పునరుద్ధరణ కోసం జరుగుతున్న పరీక్షల పురోగతి పనుల వివరాలు ఎప్పటికప్పుడు NDSA కు నివేదించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖా కార్యదర్శిని ఆదేశించారు.