హైదరాబాద్: రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర డిజిపీ సి.వి. ఆనంద్ శుక్రవారం సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాన్ని అందజేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా శాలువా కప్పి సి.వి. ఆనంద్ ని అభినందించారు. పోలీసింగ్‌లో రాష్ట్రం ఉన్నత శిఖరాలను చేరుకునేలా కృషి చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అభిలషించారు.