చారిత్రాత్మక యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్రావు గారి ఆదేశాల మేరకు దాదాపు 30 కిలోమీటర్ల మేరకు సెంట్రల్ మిడెన్(2.3 మీటర్లు) బ్యూటిఫికేషన్ పనులకు శ్రీకారం చుట్టిన హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ)
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీ అర్వింద్ కుమార్ గారి పర్యవేక్షణలో నేషనల్ హైవే – 163(ఫోర్ లేన్) ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్) ఘట్కేసర్ నుంచి రాయగిరి(యాదాద్రి) వరకు(30కి.మీ) గ్రీనరీ డెవలప్మెంట్, బ్యూటిఫికేషన్ పనులు ప్రారంభించిన హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ యంత్రాంగం
రూ.5.55కోట్ల వ్యయంతో యుద్ధప్రాతిపదికన రెండు నెలల్లో పూర్తిచేయాలని సంకల్పించిన హెచ్ఎండీఏ
ఒక్క కిలోమీటర్ కు రూ.18.50లక్షలు అంచనా వ్యయంతో గురువారం(ఫిబ్రవరి 27న) పనులు ప్రారంభించిన హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ
నేషనల్ హైవే – 163 యాదగిరిగుట్ట వరకు గ్రీనరీ, బ్యూటిఫికేషన్ పనులు చేపట్టాలన్న విజ్ఞప్తికి సానుకూలతను వ్యక్తం చేయని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్ హెచ్ ఏఐ)
యాదాద్రి ఆలయ పనులు వేగవంతంగా పూర్తి అవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి ఆదేశాలకు లోబడి నేషనల్ హైవే – 163 యాదగిరిగుట్ట వరకు గ్రీనరీ, బ్యూటిఫికేషన్ బాధ్యతలు స్వీకరించిన హెచ్ఎండీఏ
దాదాపు 30 కిలోమీటర్ల పొడవును 4 కిలోమీటర్ల చొప్పున 7 భాగాలుగా విభజించి అతి తక్కువ సమయంలో పనులు పూర్తిచేసేందుకు సంకల్పించిన అర్బన్ ఫారెస్ట్రీ యంత్రాంగం.
హైవే – 163 సెంట్రల్ మిడెన్లోని 2.3 మీటర్ల స్థలంలో పగడ, పుత్రన్ జీవ తదితర మొక్కలు నాటాలని నిర్ణయించిన అర్బన్ ఫారెస్ట్రీ అధికారులు.
మొత్తంగా హైవే – 163 సెంట్రల్ మిడెన్లో దాదాపు 3.72లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేసిన అధికారులు.