చెక్ బౌన్స్ కేసులో సినీ నటుడు ప్ర‌కాశ్ రాజ్‌కి స‌మన్లు జారీ చేసిన హైకోర్టు

సినీ నటుడు ప్ర‌కాశ్ రాజ్ ఇటీవ‌ల న‌డిగ‌ర్ అనే చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీ తమిళంలో రూపొందించిన ఉన్‌ సమయల్‌ అరైయిల్‌ చిత్రానికి రీమేక్‌. ఈ చిత్రానికి గాను బాలీవుడ్‌ ఫైనాన్సియర్‌ ఒకరి వద్ద రూ.5 కోట్లు అప్పు తీసుకున్న ప్ర‌కాశ్ రాజ్, ఇటీవ‌ల చెక్ ఇచ్చారు. ఆ చెక్ బ్యాంక్‌లో వేయగా బౌన్స్ అయింది. దీంతో స‌ద‌రు ఫైనాన్షియ‌ర్ మ‌ద్రాస్ హైకోర్టులో పిటీష‌న్ దాఖ‌లు చేయ‌గా, న్యాయ‌మూర్తి ప్ర‌కాశ్ రాజ్‌కి స‌మ‌న్లు జారీ చేశారు. ఏప్రిల్‌ 2వ తేదీలోగా కోర్టుకు హాజరవ్వాలని ఆదేశించారు.