చెట్లు కొట్టేసిన గేటెడ్ కమ్యూనిటీకి జరిమానా విధించిన అటవీ శాఖ

అనుమతి లేకుండా చెట్లు కొట్టేసిన గేటెడ్ కమ్యూనిటీకి ఫైన్ విధించిన అటవీ శాఖ. ఇందు ఫార్చూన్ ఫీల్డ్ కూకట్ పల్లి లో అనుమతి లేకుండా దాదాపు 40 చెట్లు కొట్టివేత. కమ్యూనిటీలో అదనపు సౌకర్యాల కల్పన కోసం చెట్లు కూల్చాల్సి వచ్చిందని వివరణ. కొట్టేసిన చెట్లను ట్రాన్స్ లొకేట్ చేశామన్న ఇందు ఫార్చూన్, శాస్త్రీయంగా జరగలేదని నిర్థారించిన అధికారులు. రూ.53,900 రూపాయల ఫైన్ విధింపు, కొట్టిన చెట్లకు బదులుగా 80 మొక్కలు నాటి సంరక్షించాలని షరతు విధించారు. వాల్టా చట్టం అతిక్రమణ కింద అపరాధ రుసుము, బదులుగా చెట్లు నాటాలని స్పష్టం చేసిన అటవీ శాఖ మేడ్చల్ జిల్లా అటవీ అధికారి సుధాకర్ రెడ్డి.