- ఉభయ రాష్ట్రల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని సమన్వయం చేసుకుంటాం
- తెలంగాణా రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలుగ కుండా ప్రాజెక్టుల రూపకల్పన ఉండాలి
- రెండు రాష్ట్రాలకు ఉపయోగపడే రీతిలో సాగునీటి,త్రాగునీటి ప్రాజెక్టులపై కూలంకషంగా చర్చలు
- కృష్ణానదిపై ప్రాతిపదిత బ్యారేజ్ నిర్మాణ అంశాలపై సాంకేతిక అంశాలపై విస్తృతంగా చర్చ
- తెలంగాణా సాగునీటి హక్కులు, భవిష్యత్ అవసరాల పరిరక్షణ
- కృష్ణా జలాల సమన్యాయ వినియోగంపై రాష్ట్ర హక్కులను కాపడుకునేల చర్చలు
- అంతర్ రాష్ట్ర సమన్వయంతో త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం
- తెలంగాణా రైతాంగం సాగునీటి అవసరాలకు చర్చలలో పూర్తి ప్రాధాన్యత
- పరస్పర అవగాహనతోటే కృష్ణా జలాల వినియోగం
- రెండు రాష్ట్రాల త్రాగునీటి అవసరాలపై కలిసి పోయే విదంగా చర్యలు
నీటివినియోగం పై ఉభయ రాష్ట్రాలకు సానుకూలంగా ఉండే విదంగా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల ప్రయోజనాలను పరిరక్షణకు అనుకూలంగా ఉండే విధంగా రెండు రాష్ట్రాల మధ్యన ఒడంబడిక కుదుర్చుకుంటామని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణా-కర్ణాటక రాష్ట్రల మధ్యన కృష్ణా జలాల వినియోగం,త్రాగు,సాగునీటి అవసరాలపై కర్ణాటక రాష్ట్ర చిన్ననీటి తరహా శాఖామంత్రి బోసురాజు రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి తో డాక్టర్ బి.ఆర్.అంబెడ్కర్ సచివాలయంలో సోమవారం రోజు భేటి అయ్యారు. ఈ భేటీలో రాష్ట్ర ఎక్సయిజ్ శాఖామంత్రి జూపల్లి కృష్ణారావు, పశుసంవర్ధక, క్రీడల శాఖామంత్రి వాకిటి శ్రీహరి, రాష్ట్ర ప్రణాళికా శాఖా సంఘం వైస్ చైర్మన్ జీ. చిన్నారెడ్డి రాయచూరు లోకసభ సభ్యులు జీ. కుమార్ నాయక్,నాగర్ కర్నూల్ లోకసభ సభ్యులు మల్లు రవి లతో పాటు రాయచూరు రూరల్ శాసనసభ్యులు బసన్నగౌడ ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి,మేఘారెడ్డి,శివకుమార్ రెడ్డి,వంశీకృష్ణ,రాష్ట్ర నీటిపారుదల శాఖా ప్రధాన కార్యదర్శి ఇ. శ్రీధర్,సహాయ కార్యదర్శి కే. శ్రీనివాస్, ఇ. ఎన్.సి రమేశ్ బాబు,కర్ణాటక రాష్ట్ర చిన్నతరహా నీటిపారుదల శాఖా కార్యదర్శి బి.కే పవిత్ర తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కృష్ణా జలాలను రెండు రాష్ట్రాల వినియోగంపై పరస్పర అవగాహనతో స్నేహాపూర్వక వాతావరణంలో చర్చలు నిర్వహించామన్నారు. భవిష్యత్తులో అనుసరించ బోయే విధానాలు ఉభయ రాష్ట్రాలకు ప్రయోజనాకారిగే ఉండేలా నిర్ణయం తీసుకున్నామన్నారు. తెలంగాణా రాష్ట్ర ప్రయోజనాలకు భంగం వాటిళ్ల కుండా ఉండేలా అనుసరించాల్సిన ప్రతిపాదనలను కర్ణాటక చిన్న నీటి తరహా శాఖామంత్రి బోసురాజు కు సమగ్రంగా వివరించినట్లు ఆయన తెలిపారు. కృష్ణా నదిపై ప్రతిపాదిత బ్యారేజ్ నిర్మాణానికి సంబంధించిన సాంకేతికత అంశాలపై విస్తృతంగా చర్చించినట్లు ఆయన వెల్లడించారు. తెలంగాణా సాగునీటి, త్రాగునీటి హక్కులు పరిరక్షణ భవిష్యత్ అవసరాలకు అనుసరించాల్సిన విధి విధానలపై ప్రాథమిక చర్చలు జరిపినట్లు ఆయన తెలిపారు. అంతర్ రాష్ట్ర సమన్వయంతో త్రాగునీటి సమస్యకు శాశ్వతంగా పరిష్కారానికి రూపొందించిన ప్రతిపాదనలు కర్ణాటక ముందుంచినట్లు ఆయన చెప్పారు. కృష్ణా నది జలాశయాల వినియోగంపై జరిగిన ఉభయ రాష్ట్రాల చర్చలలో తెలంగాణా రైతాంగం సాగునీటి అవసరాలకు పూర్తి స్థాయిలో ప్రాధాన్యత ఇచ్చి చర్చించినట్లు ఆయన తెలిపారు. సాగునీటి, త్రాగునీటి విషయంలో రాష్ట్ర హక్కులకు భంగం వాటిళ్ల కుండా ఉభయ రాష్ట్రాలకు సానుకూలంగా ఉండే విదంగా కృష్ణా జలాల వినియోగం పై కూలంకషంగా రెండు రాష్ట్రాల మధ్య చర్చలు జాతిగాయని ఆయన తెలిపారు. రెండు రాష్ట్రాల మద్యన జరిగిన చర్చలను ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డికి వివరించి సమిష్టి నిర్ణయం తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
