
హైదరాబాద్ నగరంలోని చిక్కడపల్లి అశోక్‌నగర్‌లో ఉన్న లేబర్ ఆఫీస్‌పై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. లేబర్ సర్టిఫికెట్ కోసం లంచం డిమాండ్ చేసిన అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ అబ్దుల్ షఫీ. బాధితుడి ఫిర్యాదు మేరకు ఈ రోజు రూ.4 వేలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోదక శాఖ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. లంచం ఇవ్వడం, లంచం తీసుకోవడం నేరమని ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే తమకు ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు విజ్ఞప్తి చేశారు.