అమీర్‌పేట అగ్ని ప్రమాద ఘటన స్థలాన్ని పరిశీలించిన హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు, రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అగ్ని ప్రమాదాల నివారణకు కఠిన మార్గదర్శకాలు అమలు చేయనున్నట్లు తెలిపారు. పాత విద్యుత్ వైరింగ్, అధిక విద్యుత్ వినియోగం, భద్రతా నిబంధనల ఉల్లంఘనలే చాలా ప్రమాదాలకు కారణమవుతున్నాయని పేర్కొన్నారు. ఫైర్ NOCలు, భవనాల తనిఖీలు, నిబంధనలు పాటించని వారిపై చర్యలు మరింత కఠినంగా ఉండనున్నాయని వెల్లడించారు.