టీచింగ్ ఆసుపత్రులలో ఎక్విప్మెంట్ ఏర్పాటు చేయలి: ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ

రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరాబాదులోని సచివాలయంలో తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన నిర్మాణ పనుల పురోగతిపై చర్చించారు. ఈ సమావేశంలో CURE ఏరియాలో సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్ ఏర్పాటుపై సమీక్షించారు. 70 శాతం నిర్మాణ పనులు పూర్తి అయిన టీచింగ్ ఆసుపత్రులలో ఎక్విప్మెంట్ ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోని చేపట్టిన అన్ని నిర్మాణ పనులను ఏడాది లోపు పూర్తి చేయాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. టీవీవీపీ ఆస్పత్రులలో ఇప్పటికే చేపట్టిన మైనర్, మేజర్ వర్క్స్ లను వచ్చే మూడు నెలల్లో పూర్తి చేయాలన్నారు. డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ (DME) పరిధిలో నిర్మాణం అవుతున్న టీచింగ్ ఆసుపత్రుల నిర్మాణ పనుల పురోగతిపై చర్చించారు. నిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేయాలని మంత్రి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మూడో విడత లో ప్రారంభమైన టీచింగ్ ఆసుపత్రుల నిర్మాణ పనులపై, భూసేకరణ పై చర్చించారు. నర్సింగ్ కాలేజీలు, హాస్టల్స్, టీచింగ్ హాస్పిటల్స్ నిర్మాణ పనులు, ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రులు , మాత శిశు సంరక్షణ కేంద్రాలు, క్రిటికల్ కేర్ బ్లాక్స్ ల నిర్మాణ పనుల పురోగతి, సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్ ఏర్పాటుపై సమీక్షించారు . తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలో చేపట్టిన మైనర్, మేజర్ సివిల్ వర్క్స్ తో పాటు ఆస్పత్రుల ఉన్నతీకరణపై మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల బ్రాండింగ్ పై అధికారులతో చర్చించారు. వీటితోపాటు రాష్ట్రంలో ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్ల నిర్మాణాలపై సమగ్ర నివేదికను సమర్పించాలని మంత్రి ఇంజనీరింగ్ , వైద్య శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జెడ్ చొంగ్తు, టి జి ఎం ఎస్ ఐ డి సి ఎండి గౌరవ్ ఉప్పల్, చీఫ్ ఇంజనీర్ శశిధర్ , ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.