ఎంసీఆర్ హెచ్ ఆర్డీ బోధీ పెవిలియ‌న్ లో వ‌ర్షాలు, ప్ర‌కృతి విపత్తుల‌పైన ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స‌మీక్ష‌

  • తీసుకోవాల్సిన ముందస్తు చ‌ర్య‌ల‌పైన అధికారుల‌కు సీఎం దిశానిర్దేశం
  • భారీ వర్షాల నేపథ్యంలో అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ (CURE) పరిధిలోని హై అలర్ట్ ఉండాలని ఉన్నతాధికారులకు ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి. పోలీస్, ట్రాఫిక్ పోలీస్, మున్సిపల్, హైడ్రా, విద్యుత్, వాటర్ బోర్డ్, ఇతర సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. చీఫ్ సెక్రటరీ, డీజీపీ, CURE స్పెషల్ సీఎస్ సహా సీనియర్ అధికారులందరితో యుద్ధ ప్రాతిపదికన సమీక్షించి చర్యలు చేపట్టాలన్న సీఎం. నగరవాసులకు ఇబ్బందులు తలెత్తకుండా సత్వర చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రెయిన్ ఫోర్ కాస్టింగ్ ఆధారంగా రోడ్లపై నీరు నిలిచే ప్రాంతాలు, సమస్యాత్మక ప్రాంతాల్లో ముందస్తుగా టీమ్స్ మోహరించాలని సూచించారు. హాజ‌రైన రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణారావు, డీజీపీ సీవీ ఆనంద్, సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రి, స్పెష‌ల్ చీఫ్ సెక్రటరీ లు జయేష్ రంజన్, వికాస్ రాజ్, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, హైద‌రాబాద్ మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ క‌ర్ణ‌న్, సైబ‌రాబాద్ మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ సృజ‌న‌, మ‌ల్కాజ్ గిరి కార్పొరేషన్ క‌మిష‌న‌ర్ విన‌య్ క్రిష్ణారెడ్డి , పోలీస్ క‌మిష‌న‌ర్లు స‌జ్జ‌నార్, ర‌మేష్ రెడ్డి, సుమతి, హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్, సిఎంఓ అధికారులు,ఇరిగేషన్,అగ్రికల్చర్,ఆర్ అండ్ బీ,జలమండలి ఉన్నతాధికారులు. సమావేశంలో పాల్గొన్న అధికారులు.