గ్రీన్ ఇండియా ఛాలెంజ్ & రోజా వనంలో పాల్గొని మొక్కలు నాటిన ప్రముఖ నటి ఖుష్బూ

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరియు రోజా వనం సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో ఈరోజు ప్రముఖ నటి ఖుష్బూ మూడు మొక్కలు నాటి మరో ముగ్గురిని నామినేట్ చేశారు ఈ సందర్భంలో రోజా వనం ఫౌండర్ రోజా గారు మరియు గ్రీన్ ఇండియా చాలెంజ్ కో ఫౌండర్ రాఘవ పాల్గొన్నాను ఈ సందర్భంగా కుష్బూ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ఎంతో కృషి చేస్తున్న రోజాని , ఎంపీ సంతోష్ ని కుష్బూ ప్రత్యేకంగా అభినందించారు. మానవ మనుగడకు అతి ముఖ్యమైనవి.. ఆహారం, దుస్తులు, నివాసం. వీటితోపాటు ప్రాణ వాయువు ఆక్సిజన్ కూడా ఎంతో అవసరం. ఈ అవసరాలన్నీ దాదాపు మొక్కల నుంచి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా తీరుతున్నాయి. అంతేకాకుండా ఇతరత్రా అనేక రూపాల్లో మొక్కలు మానవుని అవసరాలకు ఉపయోగపడుతు న్నాయి. వీటిని మనం ఎంత విరివిగా పెంచితే అంత మంచిది. ఈ సందర్భంగా రోజా గారు మాట్లాడుతూ 10 నిమిషాలు ఆక్సిజన్ ఇచ్చే డాక్టర్ ని దేవుడు అంటాం, మనకు జీవితం మొత్తం ఉచితంగా ఆక్సిజన్ ఇచ్చే మొక్కలను జాగ్రత్తగా, బాధ్యతగా పెంచాలి. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ తన అమూల్యమైన సమయాన్నీ ప్రజల శ్రేయస్సు కోసం, వారికి అవగాహన కల్పించాలని ఆమె గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న కుష్బూని, సహకారాన్ని అందించిన రోజాని ప్రత్యేకంగా అభినందించారు.