గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మిర్చి రైతులు మృతి

మిర్చి లోడ్‌తో వెళ్తున్న ఓ లారీ బోల్తాపడింది. ఈ ఘటన వెల్దుర్తి మండలం, శ్రీరాంపురం తండా వద్ద చోటుచేసుకుంది. లారీ బోల్తా పడిన ప్రమాదంలో డ్రైవర్‌ సహా నలుగురు మిర్చి రైతులు మృతిచెందారు. మరో ముగ్గురు రైతులకు తీవ్రగాయాలయ్యాయి. బోధిలవీడుకు చెందిన రైతులు మిర్చిని మార్కెట్‌కు తీసుకెళ్తుండగా ఈ విషాద ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకొని, క్షతగాత్రులను మెరుగైన వైద్యం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అంబులెన్స్‌లో మార్చురీకి తరలించారు. అనంతరం, పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు.