అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖని మర్యాదపూర్వకంగా కలిసిన పర్యావరణ, అటవీశాఖల నూతన ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. శైలజా రామయ్యర్ కు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కొండా సురేఖ. శైలజా రామయ్యర్ పర్యవేక్షణలో అటవీ, పర్యావరణ శాఖలు బాగా రాణించాలని ఆకాంక్షించిన మంత్రి కొండా సురేఖ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశయాల మేరకు పర్యావరణ, అటవీశాఖలు మరింతగా రాణించేలా ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని నిర్దేశం. అటవీ, పర్యావరణ శాఖల ఆధ్వర్యంలో అమలవుతున్న కార్యక్రమాలపై మంత్రి, ప్రిన్సిపల్ సెక్రటరీ మధ్య సంక్షిప్తంగా చర్చ.
పర్యావరణ, అటవీశాఖల ప్రిన్సిపల్ సెక్రటరీగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన శైలజా రామయ్యర్ అటవీ, పర్యావరణ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖని జూబ్లిహిల్స్ లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ శైలజా రామయ్యర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. శైలజా రామయ్యర్ నేతృత్వంలో అటవీ,పర్యావరణ శాఖలు మరింత ప్రభావవంతంగా పనిచేసి, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆశయాలమేరకు రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ, వన మహోత్సవం, వన్యప్రాణులు, జీవవైవిధ్య పరిరక్షణ, అడవుల్లో అగ్నిప్రమాదాల నివారణ, అడవుల సంరక్షణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగం తదితర కార్యక్రమాలను సమర్థవంతంగా చేపట్టేలా కార్యాచరణను అమలు చేయాలని మంత్రి సురేఖ శైలజా రామయ్యర్ కు దిశానిర్దేశం చేశారు. అటవీ, పర్యావరణ శాఖల బలోపేతం దిశగా ప్రణాళికాబద్దంగా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా అటవీ, పర్యావరణ శాఖలకు సంబంధించిన పలు అంశాల పై మంత్రి కొండా సురేఖ, ముఖ్య కార్యదర్శి శైలజా రామయర్య మధ్య సంక్షిప్తంగా చర్చ జరిగింది.