తారామతి బారామతిని టూరిజం ప్లేస్ గా మరింతగా అభివృద్ధి చేయాలి:

తారామతి బారామతి ని టూరిజం ప్లేస్ గా మరింత గా అభివృద్ధి చేయాలి. దుర్గం చెరువును పూర్తి స్థాయి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలి. మంజీరా,దిల్ కుషా గెస్ట్ హౌస్ లను ఆధునీకరించాలి. టూరిజం హబ్ డెవలప్మెంట్ పథకం కింద వికారాబాద్ ను అభివృద్ధి చేయాలి. వికారాబాద్ లో వీరభద్రస్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేయాలి.. యాదాద్రి తరహా లో టెంపుల్ కి కమిటీ ఏర్పాటు చేయాలి. క్యూర్ పరిధి లో ఉన్న అటవీ శాఖ భూములను పర్యాటక శాఖ తో కలిసి ఎకో టూరిజంగా అభివృద్ధి చేయాలన్నారు. గుర్రంగూడ ఎకో పార్క్ తరహా లో నగరం లో ఎకో పార్క్ లు తీర్చి దిద్దాలి. ఫ్యూచర్ సిటీ లో ఉన్న అటవీ భూములను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలి. అర్బన్ ఫారెస్ట్ తరహా లో ఏర్పాట్లు చేయాలి. అర్బన్ ఫారెస్ట్ ప్రాజెక్ట్ ల కోసం స్పెషల్ ఆఫీసర్ ను ఏర్పాటు చేసుకొని పనులను ముమ్మరం చేయాలి. పురానాపూల్ హెరిటేజ్ బ్రిడ్జి లను అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలి. బ్రిడ్జిలపైన పర్యాటకుల కోసం ఏర్పాట్లు చేయాలి అన్నారు. అవకాశం ఉంటే ట్రాఫిక్ మళ్లించి పర్యాటకులకు అవకాశం కల్పించాలి. డిసెంబరు లో నిర్వహించే గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ పైన కసరత్తు ప్రారంభించాలి. సమ్మిట్ కోసం డిపార్ట్మెంట్ ల మధ్య సమన్వయం కోసం కమిటీ లు ఏర్పాటు చేయాలని సీఎం అన్నారు. ఎంసీ ఆర్ హెచ్ ఆర్ డి బోధి పెవిలియన్ లో పర్యాటక శాఖపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సీఎం సలహాదారు రామకృష్ణా రావు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్,సీఎంఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రి,సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ ,టూరిజం సెక్రటరీ వాణి ప్రసాద్,టూరిజం కార్పొరేషన్ ఎండీ గౌతమి హాజరైనారు.