- గజకర్ణ, గోకర్ణ విద్యలకు భయపడేది లేదు.
- మత్స్యకారుల సమగ్ర అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం పని చేస్తుంది.
- మత్స్యకారుల సమస్యలు పరిష్కారం ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
- మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా మత్స్య కారులకు శుభాకాంక్షలు.
- ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించిన ముదిరాజుల సంక్షేమం కోసం పాటుపడుతా
- ముదిరాజుల అభివృద్ధి కోసం మంత్రి, ఎమ్మెల్యే పదవికే కాదు.. ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధం
తెలంగాణ మత్స్య రంగ చరిత్రలో మరో చారిత్రక ఘట్టంగా నిలిచే కోహెడలో అంతర్జాతీయ మంచినీటి చేపల ఎగుమతుల కేంద్రం శంకుస్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సముద్రతీర ప్రాంతం కాకుండా దేశంలోనే తొలిసారిగా అంతర్గత రాష్ట్రంలో ఇటువంటి ఆధునిక ఎగుమతుల కేంద్రం ఏర్పాటు కావడం తెలంగాణకు గర్వకారణం. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల ఆదాయాన్ని పెంచడం, వారికి శాశ్వత ఉపాధి కల్పించడం, అంతర్జాతీయ మార్కెట్లకు అవకాశాలు కల్పించడం లక్ష్యంగా ఈ ప్రాజెక్టును చేపట్టింది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులతో సుమారు రూ.47 కోట్ల వ్యయంతో ఈ కేంద్రాన్ని నిర్మిస్తున్నారు.
తెలంగాణ ప్రస్తుతం మంచినీటి చేపల ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగుతోంది. 2025లో రాష్ట్రంలో సుమారు 4.20 లక్షల టన్నుల చేపలు, 15 వేల టన్నుల మంచినీటి రొయ్యల ఉత్పత్తి నమోదైంది. ఈ ఎగుమతుల కేంద్రం అందుబాటులోకి రావడంతో రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే చేపలకు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లు లభించి మత్స్యకారులకు మెరుగైన ధరలు అందనున్నాయి. తెలంగాణ చేపలకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు దక్కనుంది. ఈ కేంద్రంలో ఆధునిక శీతల గిడ్డంగులు, శుద్ధి యూనిట్లు, ప్యాకేజింగ్ కేంద్రాలు, శిక్షణా కేంద్రం, కస్టమ్స్ సదుపాయాలు, భారీ హోల్‌సేల్ మార్కెట్ వంటి అన్ని ఆధునిక సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నారు. సుమారు 2 వేల మంది వ్యాపారులు ఇక్కడ వ్యాపారం నిర్వహించే అవకాశం ఉండగా, లోడింగ్, అన్లోడింగ్, ప్యాకేజింగ్, రవాణా తదితర రంగాల్లో సుమారు 5 వేల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
ఈ ప్రాజెక్టు కేవలం చేపల మార్కెట్ మాత్రమే కాకుండా తెలంగాణ మత్స్య రంగాన్ని ప్రపంచ మార్కెట్‌తో అనుసంధానం చేసే అభివృద్ధి వేదికగా నిలవనుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు యువతకు కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించనుంది. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు సహకరించిన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికారులు, మత్స్యకార సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం కృతజ్ఞతలు తెలిపింది. “తెలంగాణలో ఉత్పత్తి అయ్యే ప్రతి చేపకు ప్రపంచ మార్కెట్ అందించడమే మా లక్ష్యం. మత్స్యకారుల కుటుంబాల్లో ఆర్థిక సంతోషం నింపడమే మా ప్రభుత్వ సంకల్పం.” అని ప్రభుత్వం పేర్కొంది.