రూ. 2 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ పెద్దపల్లి మున్సిపల్ AE సతీశ్‌

పెద్దపల్లి మున్సిపల్ AE సతీశ్‌ రూ. 2 లక్షల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. మున్సిపల్ పరిధిలో జరిగిన పనుల బిల్లు కోసం ఓ కాంట్రాక్టర్‌ను రూ. 2 లక్షలు ఏఈ సతీశ్‌ డిమాండ్‌ చేశాడు. దీంతో అతడు ACB ని ఆశ్రయించాడు. అతడు ఏఈకి డబ్బులు ఇస్తుండగా ఏసీబీ డీఎస్‌పీ మహేందర్‌ రెడ్డి రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.