దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణా రాష్ట్రంలో రోడ్ల అభివృద్ది జరుగుతుందని, తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. శనివారం వికారాబాద్ నియోజకవర్గం శివారెడ్డి పెట్ ఆర్ టి ఓ కార్యాలయం వద్ద 261 కోట్ల వ్యయంతో హ్యాం రోడ్ల పనులకు తెలంగాణా రాష్ట్ర శాసన సభాపతి వికారాబాద్ నియోజకవర్గ శాసన సభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్, రాష్ట్ర రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, జిల్లా ఇంచార్జి మంత్రి దుదిల్ల శ్రీదర్ బాబులతో కలిసి శంఖుస్థాపన చేశారు. ఈ సందర్బంగా స్పీకర్ మాట్లాడుతూ వికారాబాద్ నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసారని, ప్రతి మండల కేంద్రానికి బిటి రోడ్డు, డబల్ రోడ్డు వేయాలనే లక్ష్యం తో నిధులు వచ్చాయని, నియోజకవర్గ స్థాయిలో స్పీకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న వికారాబాద్ ను అభివృద్ధి చేస్తానని రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం రోడ్ల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేశారని, రోడ్లు & భవనాలు శాఖ ఆద్వర్యంలో రూ. 261 కోట్లతో వ్యయం తో హ్యాం రోడ్ల పనులకు శంఖుస్థాపన చేశామన్నారు. సమావేశంలో కౌన్సిల్ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, MP కొండా విశ్వేశ్వరరెడ్డి, చేవెళ్ల, తాండూరు శాసనసభ్యులు కాలే యాదయ్య, బి. మనోహర్ రెడ్డి, MLC అంజిరెడ్డి, జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ, SP స్నేహా మెహ్రా, వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం అనన్య, వైస్ చైర్మన్ అర్ధ సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.