రోజా వనంలో భాగంగా మొక్కలు నాటిన చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజని

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరియు రోజా వనం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు విడదల రజని (చిలకలూరిపేట ఎమ్మెల్యే ) గుంటూరు జిల్లాలోని తన నివాసంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విడదల రజని, (చిలకలూరిపేట) మాట్లాడుతూ సహచర ఎమ్మెల్యే రోజా పర్యావరణ పరిరక్షణపై పెడుతున్న శ్రద్ద అద్భుతమైన కార్యాచరణ అని, అందులో నాకు అవకాశం ఇవ్వడం ఎంతో అదృష్టం అని అన్నారు. జనాభా పెరిగింది అన్న కారణంతో పచ్చని చెట్లను నరికి వాటి స్థానంలో నివాసాలను ఏర్పాటు చేస్తున్నారు.మొక్కలను పెంచుతున్నాం అంటే బౌగోళిక వెచ్చదనాన్ని తగ్గిస్తున్నాం అని అర్ధం. పచ్చదనం కంటికి ఆహ్లాదాన్నిచ్చి ఒత్తిడిని ఆందోళనను తగ్గిస్తుంది. చెట్లు మానవునికి కావాల్సిన ప్రాణ వాయువైన ఆక్సిజన్ ను ఇచ్చి కార్బన్ డైఆక్సైడ్ ను పీల్చుకుంటాయి. అంతే కాక పరిసరాలలో వున్న కుళ్ళు వాసనలను, కలుషితమైన గాలిని గ్రహించుకొని స్వచ్చపరుస్తాయి. ఇలా మనకి ఎన్నో ఉపయోగాలున్నాయి. మొక్కలు నాటడానికి ఖాళీ స్థలం లేదనే ప్రసక్తి లేదు. ఇంట్లో ఉన్న పాత డబ్బాలు, విరిగిపోయిన మగ్ లు ఉపయోగించి కూడా మొక్కలను పెంచవచ్చు అని పట్టణ ప్రాంతాల్లో నివాసంలో ఉండే వారిని కోరారు . ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్యే రోజాని మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రముఖులను భాగస్వామ్యం చేస్తున్నందుకు ప్రత్యేకంగా అభినందించారు.