
మేడ్చల్ జిల్లా డ్రైవర్ ఎంపవర్మెంట్కు మైనార్టీ అభ్యర్థులు(ముస్లింలు, క్రిస్టియన్లు, జైనులు, బౌద్ధులు, పార్సీలు) ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా మైనార్టీ అధికారి విజయకుమారి తెలిపారు. అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తుతో పాటు (ఆధార్ కార్డు, ఆదాయ ధ్రువపత్రం, డ్రైవింగ్ లైసెన్స్, విద్యార్హత పత్రాలు, డ్రైవింగ్ సర్వీస్ పత్రం, రేషన్ కార్డు) ఒరిజినల్, జిరాక్స్ పత్రాలతో ఈ నెల 10,11వ తేదీలలో మేడ్చల్ కలెక్టరేట్లోని ప్రజావాణి హాల్‌కు రావాలని సూచించారు. అదనపు సమాచారం కోసం కలెక్టరేట్ బి-బ్లాక్‌లోని మైనార్టీ కార్యాలయంలో లేదా 900016 8256, 8143465388లను సంప్రదించాలని తెలిపారు.