వరంగల్, జనగామ, హన్మకొండ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలతో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సమీక్ష నిర్వహించారు. సెక్రటేరియట్లో జరగుతున్న సమావేశంలో పాల్గొన్న మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, కేఆర్ నాగరాజు ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, డిఎంహెచ్వోలు, ఇతర అధికారులు. జనగాం మెడికల్ కాలేజీ, జీజీహెచ్, నర్సంపేట మెడికల్ కాలేజీ, జీజీహెచ్, కాకతీయ మెడికల్ కాలేజీలో సౌకర్యాలు, ఎంజీఎంలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలు, వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులపై సమీక్షిస్తున్న మంత్రి. జిల్లాల్లోని ప్రభుత్వ హాస్పిటల్స్లో ప్రజలకు అందుతున్న వైద్య సేవలు, హాస్పిటళ్ల అభివృద్ధి పనులు, మౌలిక వసతులు, ఇతర అంశాలపై సమీక్షిస్తున్న మంత్రి దామోదర్ రాజనర్సింహ.