ఇంటర్‌ విద్యార్థులకు మంత్రి కేటీఆర్‌ శుభాకాంక్షలు

ఇంటర్మీడియట్‌ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. పరీక్షలు, గ్రేడ్‌లు ముఖ్యమే అయినప్పటికీ అవే జీవితం కాదన్నారు. ఒత్తిడికి గురికావద్దని పరీక్షలో ఉత్తమ ప్రదర్శన చూపాల్సిందిగా విద్యార్థులకు మంత్రి కేటీఆర్‌ సూచించారు.