వ్యవసాయ భూమికి సంబంధించిన పట్టా పాస్‌పుస్తకంలో తప్పుగా ముద్రితమైన తండ్రి పేరును సవరించేందుకు రూ.5 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు ఓ జీపీవో. ఏసీబీ కరీంనగర్ డీఎస్పీ మహేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం ఆత్మకూర్ గ్రామ పాలనాధికారి (జీపీవో) మాతె రాజేశ్ గురువారం ఆత్మకూర్‌లో రైతు నుంచి రూ. ఐదువేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఆయనను మెట్పల్లి తహసీల్ ఆఫీస్‌కు తీసుకెళ్లి సంబంధిత ఫైలును స్వాధీనం చేసుకొని అరెస్టు చేశారు.