MCRHRDలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్రముఖ భారత ఆర్థికవేత్త అరవింద్‌ సుబ్రమణియన్ భేటీ

MCRHRDలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ప్రముఖ భారత ఆర్థికవేత్త అరవింద్‌ సుబ్రమణియన్ భేటీ అయ్యారు. ఎక్సైజ్, జీఎస్టీ సంస్కరణలపై చర్చ. రాష్ట్ర ఖజానాకు రాబడి పెంచుతూ, సులభతర వాణిజ్యం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) ను మెరుగు పరిచేందుకు మార్గాలపై దృష్టి. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి మెరుగుపరుకునేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్లే అంశంపై చర్చ. భేటీలో పాల్గొన్న సీఎం సలహాదారు కె. రామకృష్ణా రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, కమర్షియల్ టాక్స్ & ఎక్సైజ్ సెక్రటరీ రఘునందన్ రావు, ఎక్సైజ్ కమిషనర్ హరి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.