స్టడీ టూర్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర శాసనమండలి, శాసనసభను సందర్శించిన ఒడిస్సా అసెంబ్లీ శాఖల సంబంధిత స్టాండింగ్ కమిటీ.

స్టడీ టూర్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర శాసనమండలి, శాసనసభను సందర్శించిన ఒడిస్సా అసెంబ్లీ శాఖల సంబంధిత స్టాండింగ్ కమిటీ. ఒడిస్సా స్టాండింగ్ కమిటీ చైర్మన్ సుధీర్ రంజన్ పథజోషి నేతృత్వంలో విచ్చేసిన సభ్యులకు శాసనమండలి సమావేశ మందిరంలో పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికి, శాలువాలతో సన్మానించి మెమోంటోలు బహుకరించిన తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ మరియు కౌన్సిల్ సెక్రటరీ డాక్టర్ వి. నరసింహా చార్యులు, అసెంబ్లీ సెక్రటరీ రేండ్ల తిరుపతి, లెజిస్లేటివ్ అధికారులు. అనంతరం తెలంగాణ, ఒడిస్సా రాష్ట్రాల శాసనసభలలో కమిటీల ఏర్పాటు, పనితీరుపై సమావేశంలో చర్చ జరిగింది.