- రాష్ట్ర మనవ హక్కుల కమిషన్, పీసీబీకి పిర్యాదు
- కాలుష్యంతో ప్రజలకు ముప్పు పిర్యాదులో పేర్కొన్న వంటేరు ప్రతాప్ రెడ్డి
ఎంఎస్ అగర్వాల్ పరిశ్రమతో ప్రజల ప్రాణాలకు ముప్పు ఉందని పరిశ్రమను వెంటనే తొలగించి ప్రజల ప్రాణాలు కాపాడాలని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు బిఆర్ఎస్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జీ వంటేరు ప్రతాప్ రెడ్డి గ్రామస్తులతో కలిసి పిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతు మనోహరబాద్ మండలంలోని రంగాయిపల్లి, చెట్ల గౌరారం గ్రామాలకు అనుకొని ఉన్న ఎంఎస్ అగర్వాల్ పరిశ్రమతో గాలి, నీటి కాలుష్యంతో గ్రామస్తులు రోగాల బారిన పడుతూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సోమవారం వంటేరు ప్రతాప్ రెడ్డితో కలిసి గ్రామస్తులు, నాయకులు మానవ హక్కుల చైర్మన్ షమీం అక్తర్, తెలంగాణ స్టేట్ పొల్యూషన్ బోర్డ్ కంట్రోల్ సెక్రెటరీ జి రవిలకు ఎంఎస్ అగర్వాల్ విషపూరిత పరిశ్రమ మా ప్రాంతాల నుండి తొలగించాలని పిర్యాదు చేశామన్నారు. ఎంఎస్ అగర్వాల్ కంపెనీ నుండి విడుదలయ్యే వాయు, జల, శబ్ద కాలుష్యం వలన ప్రజలకు, గుండె సంబంధిత, చర్మ సంబంధిత, కిడ్నీ సంబంధిత వ్యాధుల బారిన పడుతూ ప్రజలు అనారోగ్యానికి గురై మృతి చెందుతున్నారని తెలపడం జరిగింద న్నారు, అంతేకాకుండా ఈ విషపూరిత కాలుష్యం వలన ప్రజలు క్యాన్సర్ బారిన పడుతూ మృత్యువాత పడుతున్నారని తెలపడం జరిగిందన్నారు. పెండ్లి అయిన ఆడబిడ్డలు గర్భవతులైన తర్వాత గర్భం ఉండకుండా అబార్షన్ అవుతున్నాయని తెలపడం జరిగిందన్నారు, పెద్ద పెద్ద శబ్దాలతో విద్యార్థులు తమ చదువులను కొనసాగించలేక శబ్దాల వలన చదవలేక విద్యార్థుల జీవితం అందకారమవు తుందని విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని తెలపడం జరిగిందన్నారు. అంతేకాకుండా విషపూరిత కాలుష్యపు నీటిని తాగడం పశువులు మృత్యువాత పడుతున్నాయని, విషపూరిత నీరు చెరువులోకి కుంటలలోకి వెళ్లడం ద్వారా చేపలు మృత్యువాత పడుతున్నాయని భూగర్భ జలాలు కలుషితమై పోతున్నాయని తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సెక్రటరీ రవికి, మరియు మానవ హక్కుల కమిషన్ చైర్మన్ గార్లకు క్లుప్తంగా తెలపడం జరిగిందన్నారు. రంగాయిపల్లి చెట్లగౌరారం గ్రామాలలో విషపూరిత కాలుష్యపు నీటి ద్వారా పంటలు పండటం లేదని, బోర్లనీళ్లు త్రాగే పరిస్థితి లేకుండా పోయిందని తెలపడం జరిగిందన్నారు. ఎంఎస్ అగర్వాల్ కంపెనీ నుండి విడుదలయ్యే కాలుష్యం ద్వారా ఎలాంటి ముప్పు వాటిల్లుతుందో స్పష్టంగా వినతి పత్ర రూపంలో “తెలియజేయడం జరిగిందన్నారు. తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సెక్రెటరీ జి రవి, మరియు మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీం అక్తర్ స్పందించి వెంటనే మెదక్ జిల్లా కలెక్టర్ తో మాట్లాడి చర్యలను తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మనోహరాబాద్ మండలం బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఇమాంపూర్ శేఖర్ గౌడ్, మాజీ సర్పంచ్ లు కర్రే నాగభూషణం ముదిరాజ్, పూల అర్జున్, మాధవ రెడ్డి, పంజా బిక్షపతి ముదిరాజ్, లక్ష్మన్ సింగ్ టాగూర్, మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షులు దాసరి నరేష్ ముదిరాజ్, రేణు కుమార్, కుంట రాజు ముదిరాజ్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, రంగాయిపల్లి మరియు చెట్ల గౌరారం గ్రామాల ప్రజలు తదితరులు ఉన్నారు.