రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని అక్కచెల్లెళ్ళలకు శుభాకాంక్షలు తెలిపారు. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకైన ఈ పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ప్రతి ఇంట్లో సుఖసంతోషాలు, ఆరోగ్యం వెల్లివిరియాలని అన్నారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి, ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే బృహత్ సంకల్పంలో భాగంగా అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తోందని సీఎం తెలిపారు.