
మార్చి 10న హోలి పండుగ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ, కరోనా కారణంగా రాష్ట్రపతి భవన్‌లో హోలీ వేడుకలు నిర్వహించడంలేదని స్వయంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఒక ప్రకటలో తెలిపారు.
ఇప్పుడు మనమంతా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. కొవిద్-19 ను అరికట్టేందుకు మనమంతా పూనుకోవాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటించాలనీ.. జనసమూహంలోకి వెళ్లినప్పుడు ఖచ్చితంగా మాస్క్‌లు ధరించాలనీ, కరచాలనం చేయకుండా నమస్కరిస్తే సరిపోతుందని ఆయన తెలిపారు.