వ్యభిచారం కేసులో జబర్దస్త్‌ నటులు దొరబాబు, పరదేశి అరెస్ట్‌..

జబర్దస్త్‌ షోతో బాగా ఫేమస్‌ అయిన దొరబాబు, పరదేశిలను పోలీసులు వ్యభిచారం కేసులో అరెస్ట్‌ చేశారు. వారితో పాటు మరో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు విశాఖపట్నం మాధవధారలో గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ అపార్టుమెంట్‌లో పట్టుబడ్డారు. పోలీసులు ముందస్తు సమాచారం మేరకే వ్యభిచార కూపంపై దాడి చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.