- గతంలో పని చేసిన RO అధికారులకు ఒక న్యాయం.. ప్రస్తుత అధికారులకు ఒక న్యాయమా..?
- అప్పుడు ఓ ప్రముఖ పత్రికలలో వార్తలు వస్తే వెంటనే చర్యలు తీసుకుంటారు..?
- మరి ఇప్పుడు వచ్చిన మరో ప్రముఖ పత్రిక వార్తలపై.. ఓ సీనియర్ పర్యావరణ వేత్త చేసిన అవినీతి ఆరోపణ వీడియోలపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు..?
- పాశ మైలారం, బొల్లారంలో పరిశ్రమల నుండి విడుదలయ్యే వ్యర్ధాలను జీరో లిక్వీడ్ డిస్ చార్జ్ సిస్టం (ZLD) ద్వారా నిర్వహించకుండా అధికారుల నిర్లక్ష్యంతో రివర్స్ బోరింగ్ ద్వారా భూగర్భంలోకి వదులుతూ.. భూగర్భ జలాలను పూర్తిగా కలుషితం చేస్తున్నారు అని ప్రముఖ పత్రిక వార్తలపై మరియు ఓ పర్యావరణ వేత్త చేసిన ఆరోపణలపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు..?
- కొన్ని పరిశ్రమలు లక్షల లీటర్ల రసాయన వ్యర్ధాలను నిల్వ చేసిన పరిశ్రమల యాజమాన్యాలు.. ఇటీవల కురిసిన వర్షపు నీటితో కలిపి రసాయన వ్యర్ధాలను బయటకు వదలడంతో భూగర్భ జలాలు పూర్తిగా కలుషితం కావడం పరిసర గ్రామాల ప్రజలు ఘాటైన వాసనలతో ఇబ్బందులకు గురయ్యారు అనే ఆరోపణలపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు..?
- 18 నెలలుగా సంగారెడ్డి కాలుష్య నియంత్రణ మండలి RO అధికారులు ప్రజలకు ఎవరికి అందుబాటులో లేరు అనే ఆరోపణలపై చర్యలు ఎందుకు లేవు..?
- 18 నెలలుగా సంగారెడ్డి కాలుష్య నియంత్రణ మండలి RO అధికారులు పరిశ్రమలను సందర్శించకుండా గాలికి వదిలేశారు అనే తీవ్రమైన ఆరోపణలపై చర్యలు తీసుకోవడానికి ఉన్నతాధికారులు ఎందుకు వెనుకడుగు వేస్తున్నారు..?
- రాష్ట్రంలోనే అత్యధిక పరిశ్రమలు ఉన్న ప్రాంతీయ కార్యాలయంలోనే RO అధికారులు అందుబాటులో ఉండటం లేదన్న ఆరోపణలపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు..?
- RC పురంలో గతంలోనే అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న AEE ని తిరిగి సంగారెడ్డికి బదిలీ చేశారు. ఆ AEE ఇక్కడ కూడా పెద్ద ఎత్తున అవినీతి చేస్తున్నాడు అనే తీవ్రమైన ఆరోపణలు వచ్చిన వెంటనే చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు..?
- సంగారెడ్డి ప్రజలు 2007 లోనే 350 పరిశ్రమలపై ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్లు సుప్రీంకోర్టులో.. NGTలో కేసులు దాఖలు చేయడంతో 13 ఏండ్ల పాటు కొనసాగింది.. ప్రస్తుతం సంగారెడ్డి RO పరిధిలో PCB అధికారులు నిర్లక్ష్యం వల్ల పరిశ్రమల యాజమాన్యాలు నిబంధనలను నిలువునా పాతరవేస్తున్నారు అనే ఆరోపణలపై చర్యలు ఏవి..?
- ప్రస్తుతం సంగారెడ్డి ROలో ఉన్న అధికారులను బదిలీ చేసి.. PCB నిబంధనలకు విరుద్దంగా తప్పు చేస్తున్న పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ పై PCB ఉన్నతాధికారుల చర్యలు ఏవి..? ఈ సంగారెడ్డి RO అధికారులపై PCB ఉన్నతాధికారులకు ప్రత్యేకపైన అభిమానం ఎందుకు..?
- గత రెండు సంవత్సరాలుగా మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో PCB RO ల అధికారులు కాలుష్యం చేస్తున్న పరిశ్రమలపై నిర్లక్ష్యం వహిస్తూ.. అక్రమాలకు పాల్పడే పరిశ్రమలకు వత్తాసు పలుకుతున్నారన్న ఆరోపణలపై చర్యలు ఎందుకు లేవు..?
- PCB సంగారెడ్డి, RC పురం ROల పరిధిలో పరిశ్రమలు ఇష్టానుసారంగా పారిశ్రామిక రసాయన వ్యర్ధాలను ట్యాంకర్ల ద్వారా తెలంగాణలో ప్రముఖ పర్యాటక ప్రాంతాలలో ఒకటైన నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాంతంలో అర్ధరాత్రి వేళల్లో పడవేస్తున్నారన్న తీవ్రమైన ఆరోపణలపై PCB ఉన్నతాధికారులు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు..?
- సంగారెడ్డి, RC పురం ROలపై పెద్ద ఎత్తున్న వివిధ ప్రముఖ పత్రికలలో వార్తలు వస్తున్న చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు..?
- ఫిబ్రవరిలో బ్రోకెన్ పరిశ్రమలో అగ్నిప్రమాదం జరిగింది. గతంలో ఏదైనా పరిశ్రమలో అగ్నిప్రమాదం జరిగితే 2 నుంచి 3 వారాలు షాట్ డౌన్ ప్రకటించేది కానీ బ్రోకెన్ పరిశ్రమపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా కేవలం డైరెక్షన్స్ మాత్రమే ఇచ్చారన్న ఆరోపణలపై PCB ఉన్నతాధికారులు చర్యలు తీసుకుకోవడానికి ఎందుకు వెనుకడుగు వేశారు..?
- తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి సంగారెడ్డి, RC పురం ROల అధికారులపై వచ్చిన అవినీతి ఆరోపణలపై PCB ఉన్నతాధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు..?
- తెలంగాణ PCBలో జరుగుతున్న అవినీతి, అసాంఘిక కార్యకలపాలు, అరాచకాలు, కొందరు అధికారులకు జరుగుతున్న అన్యాయంపై పోరాటంలో భాగంగా 5 లక్షల కరపత్రాలు తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా ప్రభుత్వం దృష్టికి తెచ్చేలా పంపిణీకి సిద్ధమవుతున్న పలు పర్యావరణ సంస్థలు. టాస్క్ ఫోర్స్, CFO, CFE, జోనల్ ల్యాబ్ లలో అవినీతి ఎలా జరుగుతుందో.. కన్సల్ టెంట్స్ మాటున జరుగుతున్న అవినీతి, ఫైలుకో రేటు.. పనికో బేరం..! పై PCBకి సంబంధించిన మరింత సమాచారం పూర్తి ఆధారాలతో త్వరలో..
