
మల్కాజ్ గిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిని నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు రోజుల క్రితం రంగారెడ్డి జిల్లా జన్వాడలో అనుమతి లేకుండా డ్రోన్ కెమెరా వాడారనే కారణంతో రేవంత్ తో పాటు అతని సోదరుడు అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ తో పాటు ఆయన సోదరుడు, అనుచరులను నార్సింగి పోలీసులు అరెస్ట్ చేసి ఉప్పర్ పల్లి న్యాయస్థానానికి తీసుకెళ్లారు.
శంషాబాద్ ఎయిర్ పోర్టులో రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు. రేవంత్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించిన ఉప్పరపల్లి కోర్టు. చర్లపల్లి జైలుకు తరలింపు.