ఈ నెల 17 వ తేదీ ఉదయం 11 గంటల నుండి హైదరాబాద్ శిల్పకళా వేదికలో *బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ అవార్డ్స్-2026 వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు తెలిపారు.
శిల్పకళా వేదికలో చేస్తున్న ఏర్పాట్లను నేటి ఉదయం ఆయన పరిశీలించారు. రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ , తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జి ముకుంద రెడ్డి, క్రియేటివ్ డైరెక్టర్ కొండ రాజు, టీ జి ఎఫ్ డి సి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కిషోర్ బాబు, ఐ అండ్ పి ఆర్ అదనపు సంచాలకులు డి ఎస్ జగన్, యాంకర్ ఉదయభాను తదితరులు పాల్గొన్నారు. ఈ ఛాలెంజ్ 5 కేటగిరీల్లో ఎంపిక అయిన 35 మంది యంగ్ ఫిల్మ్ మేకర్స్ కు అవార్డులు ముఖ్య అతిథులు అందజేస్తారు.రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎ .రేవంత్ రెడ్డి ,రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్ధిక విద్యుత్ శాఖ మంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు, రాష్ట్ర రోడ్లు ,భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి లు, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు, ఐ .టి.ఈ.సి. , పరిశ్రమలు, వాణిజ్య, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఇతర ప్రజా ప్రతినిధులు , సినిమా రంగ ప్రముఖులు, తదితరులు పాల్గొంటారు.
బతుకమ్మ పండుగ ను పురస్కరించుకుని తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 2 వ యంగ్ ఇండియా ఫిల్మ్ మేకర్స్ అవార్డ్స్ ఛాలెంజ్-2026 లో భాగంగా 5 కేటగిరీల పోటీలలో పాల్గొనేందుకు 2,670 మంది ఔత్సాహికులు రిజిష్ట్రేషన్ చేసుకున్నారు. ఎంట్రీల పరిశీలన, అవార్డులకు ఎంపికకు ప్రతి కేటగిరీకి ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు.1)ఫిల్మ్స్, 2)సాంగ్స్, 3)ఫోక్ సాంగ్స్, 4)ఇన్ఫ్లూయెన్సర్స్ కేటగిరీల్లో ప్రతి కేటగిరీలో మొదటి బహుమతిగా రూ.3 లక్షలు, ద్వితీయ బహుమతిగా రూ.2 లక్షలు, తృతీయ బహుమతిగా రూ.1 లక్ష చొప్పున అందజేస్తారు మరియు ఈ 4 కేటగిరీలో ప్రతి కేటగిరీలో 5 కన్సోలేషన్ బహుమతుల కింద ఒక్కొక్కరికి రూ.20 వేల చొప్పున ఇస్తారు. అలాగే 5 వ కేటగిరీ ఆర్టికల్స్ కేటగిరీ అవార్డ్స్ కింద ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతుల కింద రూ.3 లక్షలు, రూ. 2 లక్షలు, రూ 1 లక్ష చొప్పున అందజేస్తారు .
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్- 2026 అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించిన టీజీఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ప్రతినిధి బృందం. హాజరైన సినీ దర్శకుడు హరీష్ శంకర్, తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, చరణ్ అర్జున్, నల్గొండ గద్దర్ తదితరులు. ఈ నెల 17న శిల్పకళా వేదికలో అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం.
