భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కు రెండు అంబులెన్స్ లు మంజూరు

మంత్రి పువ్వాడ అజయ్ సిఫార్సీ మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కు రెండు అంబులెన్స్ లు మంజూరు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో పేదలకు, గిరిజనులకు అత్యవసర సమయంలో వైద్య చికిత్సలు వేగంగా అందించాలనే ఆకాంక్షతో అంబులెన్స్ లు మంజూరు కోరుతూ హోసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (HUDCO) కి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేసిన సిఫారసు మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం జిల్లా ప్రధాన ఆసుపత్రి-1, భద్రాచలం ఏరియా ఆసుపత్రికి-1 అధునాతన అంబులెన్స్ లను మంజూరు చేస్తున్నట్లు సంస్థ ఉత్తర్వులను జారీ చేసింది. ఆ ధ్రువ పత్రాన్ని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కి సంస్థ రీజినల్ చీఫ్ LVS సుధాకర్ బాబు హైదరాబాద్ లో గురువారం అందజేశారు.