స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి దసరా వేడుకలు

విజయదశమి వేడుకలను సీఎం రేవంత్ రెడ్డి తన స్వగ్రామం నాగర్‌కర్నూలు జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో జరుపుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం 2:50 గంటల సమయంలో హెలికాప్టర్‌లో కొండారెడ్డిపల్లికి సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా చేరుకున్నారు. సాయంత్రం 6:30 గంటలకు షమీ వృక్షానికి ప్రత్యే క పూజలు నిర్వహించేందుకు కాలినడకన వెళ్లారు. వేలమంది కొండారెడ్డిపల్లికి చేరుకోవడంతో గ్రామంలో కిక్కిరిసిన వాతావరణం కన్పించింది. తన సోదరులు తిరుపతిరెడ్డి, కృష్ణారెడ్డి, కొండల్‌రెడ్డి, అల్లుడు సత్యనారాయణరెడ్డి, మనువడు రియాన్ష్‌తో కలిసి షమీ వృక్షానికి పూజ నిర్వహించిన అనంతరం గ్రామంలోని ఆంజనేయస్వావి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు జరిపారు. వేదిక వద్ద గ్రామస్థులు, తన అభిమానులు, కాంగ్రెస్‌ కార్యకర్తలను ప్రత్యేకంగా కలుసుకున్నారు.